ఫోటో స్టొరీ: ఎగ్జిబిట్ కోసం అందాల ఎగ్జిబిషన్

Tue Sep 10 2019 09:55:20 GMT+0530 (IST)

Tara Sutaria Poses for Exhibit Magazine Cover Page

ఇన్స్టాగ్రామ్ లో ఒకవైపు వయసుమళ్ళిన భామల హంగామా సాగుతూనే ఉంది.. నిజానికి ఇరవైల్లో ఉండే హీరోయిన్ల కంటే ముప్పైలలో నలభైల్లో ఉండే లేటువయసు భామల హంగామా చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.  సరే.. ఆ భామలు ఎంత ఫిట్నెస్ మెయిన్టెయిన్ చేసినా.. ఓ నెల రోజులు హెయిర్ కలర్ కనుక వెయ్యకపోతే అసలు బండారం బయటపడే బాపతు!  అయితే ఇరవైల భామలు కూడా ఈమధ్య వారితో పోటీకి సైసై అంటున్నారు. సారా అలీ ఖాన్.. జాన్వి కపూర్.. అనన్య పాండే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు పెద్దదే ఉంది.  ఈ లిస్టులో ఉన్న మరో భామ తార సుతారియా.ఈ భామ ఎవరు అంటే ది ఫేమస్ కరణ్ జోహార్ పరిచయం చేసిన హీరోయిన్.  ఆయన నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' తారకు మొదటి సినిమా.  మొదటి సినిమాకు పాసు మార్కులు తెచ్చుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.  హాటు ఫోటోలతో టెంపరేచర్లు పెంచే గేమ్ మొదలు పెట్టింది.  మ్యాగజైన్ కవర్ పేజీలను కూడా రఫ్ఫాడించే పనులు కూడా స్టార్ట్ చేసింది.  తాజా ఎగ్జిబిట్(Exhibit) మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజికి పోజిచ్చి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.  ఈ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ "నా శిరోజాలను గాలి తాకుతుంటే..నా హృదయంలో పాట వినిపిస్తుంటే" అంటూ కవితాత్మకంగా ఒక క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటో షూట్ చేసిన ఫోటోగ్రాఫర్ ఎవరనుకున్నారు ?  శ్రద్ధ కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ.

ఇక ఈ మ్యాగజైన్ లో 'తారా సుతారియా: ది బ్లేజింగ్ స్టార్' అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురించారు. ఈ  ఫోటోలో బ్లాక్ అండ్ వైట్ టాప్.. వైట్ కలర్ స్కర్ట్ ధరించి సూటుకేసులపై కూర్చుంది.  వాటితో పాటు నేలపై ఒక రేడియో కూడా ఉంది.  ఒక చేతికి మాత్రం రిస్ట్ బ్యాండ్స్ ధరించింది.  షూ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్.  నేపథ్యంలో ఎండుగడ్డి ఉండడంతో ఫోటో ఒక పెయింటింగ్ లా కనిపిస్తోంది. సడెన్ గా చూస్తే తారను ఒక హాలీవుడ్ హీరోయిన్ అనుకోవడం ఖాయం.  ఇక నెటిజన్లు కూడా తెగ రెచ్చిపోయి "రెడ్ హాట్ బ్యూటీ".. "ఫ్రాంక్లీ ఫ్యాబులస్".. "కొత్త  బాలీవుడ్ ప్రిన్సెస్ వచ్చిందోచ్".. "స్టన్నింగ్ డ్రెస్.. సూపర్ పోజ్' అంటూ కామెంట్లు పెట్టారు.  తారా సుతారియా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'మర్జావా' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.