'మాస్కో' వీధుల్లో స్టార్ హీరోయిన్ చక్కర్లు.. ఫోటోస్ వైరల్!

Fri Jun 18 2021 20:00:02 GMT+0530 (IST)

Tapsee Latest Photo

బాలీవుడ్ కర్లీ హెయిర్ యాక్ట్రెస్ తాప్సీ పన్నూ.. ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ పార్టనర్.. సోదరి షగున్ పన్నూతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. మాస్కో వీధుల్లో తిరగటం.. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. వాల్యూబుల్ పోస్ట్-కార్డ్ ఫోటోలకు పోజులిస్తూ ఇద్దరూ ఛిల్ల్ అవుతున్నారు. ఇటీవలే మాస్కో వీధులను తిరుగుతూ తాప్సీ స్కూటర్ డ్రైవ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. అలాగే తన సిస్టర్ షగున్ తో జర్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. తాప్సీ ఇంతకాలం వరుసగా షూటింగ్స్ తో రెస్ట్ లేకుండా నలిగిపోయింది. అందుకే ఇప్పుడు మాస్కో టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.అయితే మాస్కో డైరీస్ అంటూ అమ్మడు అక్కడ దిగిన డిఫరెంట్ ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. బ్లూ కలర్ డ్రెస్ లో తాప్సీ మాస్కోను చుట్టేందుకు స్కేటింగ్ టైప్ స్కూటర్ జర్నీ ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఇద్దరు కలిసిహాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కు వెళ్లినట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వీడియో కూడా షేర్ చేసింది. ఇంతకాలం బిజీగా గడిపిన తాప్సీకి ఈ టూర్ మానసికంగా రిలీఫ్ కలిగిస్తుందని టాక్. అలాగే పరిస్థితి నార్మల్ అవుతుందంటూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అలా ఆకాశం వైపు చూస్తూ పోజు పెట్టింది. హలో మాస్కో నార్మల్ అగైన్.. అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాప్సీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. తాప్సీ చివరిసారిగా గతేడాది తప్పాడ్ సినిమాలో కనిపించింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఆ సినిమా తాప్సీ నటన విమర్శకుల నుండి..  ప్రేక్షకుల నుండి ప్రశంసలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తాప్సీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయట. కానీ తదుపరి సినిమా మాత్రం ఓటిటి రిలీజ్ కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా హసీన దిల్రుబా సినిమా రానుంది. ఈ సినిమాలో తాప్సీతో పాటు విక్రాంత్ మాస్సే..  హర్షవర్ధన్ రాణే కూడా నటించారు. ఇటీవలే సినిమ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో తాప్సీ చాలా బోల్డ్ గా కనిపించనుంది. చివరిగా హసీన్ దిల్రుబా చిత్రం జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.