Begin typing your search above and press return to search.

హొయలు చూపి మతుల్ పోగొడుతున్న డిస్కో భామ!!

By:  Tupaki Desk   |   6 Aug 2020 8:30 AM GMT
హొయలు చూపి మతుల్ పోగొడుతున్న డిస్కో భామ!!
X
తాన్యా హోప్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు మొత్తం కాకపోయినా కాస్త పరిచయమే. ఎందుకంటే ఈ యంగ్ హీరోయిన్ తెలుగు సినిమాల ద్వారానే తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. బెంగుళూరులో పుట్టి, ముంబైలో పెరిగిన ఈ 23 ఏళ్ల కుర్ర భామ తన అందాలతో సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాన్యా హోప్ తాజాగా ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. తాన్యా సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ చేసింది. 2015లో మిస్ ఇండియా కోల్‌కతా కిరీటం కూడా దక్కించుకుంది. అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్ లలో కూడా ఒకరు. ఇక 2016లో 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే తెలుగు సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి 'పేపర్ బాయ్' సినిమాతో లీడ్ హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత రామ్ హీరోగా నటించిన 'నేనుశైలజ' సినిమాలోని ఓ పాటలో మెరిసింది.

ఇక జగపతిబాబు నటించిన 'పటేల్ సార్' సినిమాలో ఏసీపీ క్యారెక్టర్ పోషించి మెప్పించింది. ఇక 2019లో అరుణ్ విజయ్ సరసన నటించిన 'తడం' మూవీతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది అమ్మడు. అదే విధంగా కన్నడ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతోంది భామ. ఇక చివరిగా మాస్ రాజా రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాలో కనిపించింది. మళ్లీ అమ్మడు తెలుగు సినిమాలలో కనిపించలేదు. అలాగని ప్రస్తుతం షూటింగ్స్ ఏవి జరగట్లేదు కదా.. ఇంటి పట్టునే ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు ఓ పిక్ షేర్ చేసింది. బేసిగ్గా అందాల ఆరబోతకు వెనుకాడని తాన్యా.. ఈ ఫోటోలో తన గ్లామరస్ నడుము చూపి కుర్రకారు మతి పోగొడుతుంది. హోప్ హొయలు చూస్తూ గ్లామర్ ప్రియులంతా మనసు పారేసుకుంటున్నారు.