Begin typing your search above and press return to search.

స‌ముద్ర విహారంలో 'అర‌ణ్య' బ్యూటీ ప‌ర‌'ధ్యానం'

By:  Tupaki Desk   |   1 March 2021 2:30 AM GMT
స‌ముద్ర విహారంలో అర‌ణ్య బ్యూటీ ప‌ర‌ధ్యానం
X
రానా స‌ర‌స‌న అర‌ణ్య (హాథీ మేరా సాథీ) చిత్రంలో న‌టిస్తోంది త‌నీషా ముఖ‌ర్జీ. ఈ భామ అభిరుచుల గురించి తెలిస్తే షాక్ తింటారు. తనీషా ముఖర్జీ హ్యాపీ ప్లేస్ ఏదో తెలుసా? ఇదిగో ``ఇది నా ధ్యానానికి న‌చ్చే ప్లేస్`` అని తనీషా చెబుతోంది.
అలా స‌ముద్రంలో తేలియాడే స్థ‌లం త‌న‌కు ఇష్ట‌మ‌ట‌. ధ్యానానికి మూడ్ రావాలంటే ఒక సుందరమైన దృశ్యం ఉండాలి. సముద్రం ఖచ్చితంగా ఉండాలి. ఇదిగో ఈ ఫోటోనే ఒక ప్రూఫ్‌. స‌ముద్రంలో మ‌ర‌బోట్ పై బ్రౌన్ స్విమ్సూట్ ధరించి క‌నిపించింది. ఇక ఈ ఫోటోలో త‌నీషా వీపందం ఎలివేట్ అయ్యింది.

``తిరిగి జీవం వ‌చ్చిన‌ట్టుంది ... సముద్రం నాలో చైతన్యం నింపుతోంది!`` అంటూ త‌నీషా స‌ముద్ర విహారంలో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది. స‌ముద్రంలోకి దిగడం అల‌ల తరంగాల శబ్దాన్ని వినడం కంటే ఓదార్పు మరొకటి లేదు! ఇది నాకు ధ్యానం లాంటిది! అంటూ ఎమోష‌న్ కి గురైంది. వాటర్ బేబీ తనీషా ముఖర్జీ తన సంతోషాన్ని మాట‌ల్లోనే కాదు ఫోటోల రూపంలో షేర్ చేయ‌గా అవి రానా అభిమానుల్లోనూ వైర‌ల్ అవుతున్నాయి.

తనీషా ముఖర్జీ 2003 చిత్రం ష్‌.. తో బాలీవుడ్ ‌లోకి అడుగు పెట్టారు ... తరువాత ఆమె పాప్ ‌కార్న్ ఖావో! మస్త్ హో జావో- టాంగో చార్లీ - నీల్ ఎన్ నిక్కి తదితర చిత్రాల్లో న‌టించారు. బిగ్ బాస్ 7 .. ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 వంటి రియాలిటీ టీవీ షోలలో కూడా ఆమె పాల్గొంది.

రానా స‌ర‌స‌న‌ హాతి మేరే సాతి (అర‌ణ్య‌) చిత్రంలోనూ న‌టిస్తోంది. ఆమె బాలీవుడ్లో కొన్ని ఐకానిక్ చిత్రాలలోనూ ఇటీవ‌ల‌ నటించింది. బండిష్- అనోఖా రిష్ట- జ్యువెల్ థీఫ్- జీన్ కి రాహ్- సుహాగన్- స్వర్గ్ నరక్ -అనుభవ్ వంటి క్లాసిక్స్ లోనూ న‌టించింది. తనీషా కాజోల్ కి సోద‌రి. తల్లి తనూజా ఒక ప్రముఖ నటి.