2020 ఫస్టాఫ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా...?

Sat Jul 04 2020 21:39:14 GMT+0530 (IST)

Tanhaji highest collections film In 2020

కరోనా మహమ్మారి కారణంగా గత మూడున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అయి ఉంది. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వక 100 రోజులు దాటిపోయింది. ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వస్తే కొత్త కొత్త సినిమాలతో థియేటర్స్ సందడిగా ఉండేవి. కానీ ఇప్పుడు బోసి పోయి వున్నాయి. దీంతో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టగలిగే సీజన్ ని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. ఇప్పటికే ఈ ఏడాదిలో ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఫస్టాఫ్ లో టాలీవుడ్ లో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో'.. నితిన్ 'భీష్మ' వంటి సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటించిన పీరియాడికల్ డ్రామా ''తన్హాజీ : ది అన్ సంగ్ వారియర్'' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సైఫ్ అలీఖాన్ - కాజోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్‌గణ్ ఫిలింస్ మరియు టీ-సిరీస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని 3డిలో భారీ బడ్జెట్ తో రూపొందించారు.అజయ్ దేవ్‌గణ్ కెరీర్లో 100వ చిత్రంగా రూపొందిన 'తన్హాజీ' ఇప్పటి వరకు రిలీజైన మూవీస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు 279 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 367 కోట్లు కలెక్షన్లు సాధించిందని సమాచారం. గత వంద రోజులుగా మరో సినిమా విడుదల కాకపోవడంతో 2020లో కలెక్షన్స్ పరంగా నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ ఏడాది మొత్తంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా 'తన్హాజీ : ది అన్ సంగ్ వారియర్' నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కి అనుమతి లభించినా ఈ ఏడాది రిలీజ్ అయ్యే క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. సో ఈ ఏడాది ఫస్టాఫ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రంగా 'తన్హాజీ' ని చెప్పవచ్చు.