బింబిసార.. కార్తికేయ 2.. తమిళ సూపర్ స్టార్

Tue Aug 16 2022 18:00:01 GMT+0530 (IST)

Tamil superstar Vijay recently landed in Hyderabad

తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజాగా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఆయన తాజా చిత్రం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న ఆయన గ్యాప్ లో బింబిసార సినిమాను చూశాడట. బింబిసార చూసిన తర్వాత రోజే నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ని కూడా విజయ్ చూశాడట.కార్తికేయ 2 సినిమా ను చూసి బయటకు వస్తున్న సమయంలో విజయ్ ని ఫోటోలు తీసేందుకు అక్కడ ఉన్న మీడియా వారు ప్రయత్నించారు. విజయ్ మీడియా కంట పడకుండా ఉండేందుకు ఆయన డ్రైవర్ మరియు బాడీ గార్డ్ చాలానే కష్టపడ్డారు.

మీడియా వారిని నెట్టి వేయడం తో పాటు కాస్త అత్యుత్సాహం చూపించి దురుసుగా ప్రవర్తించారు. మీడియా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ్ ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్లి పోయారు. ఒక తమిళ హీరో తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూశారంటూ మీడియాలో కథనాలు వస్తాయనే ఉద్దేశ్యంతోనో లేదా మరేంటో కానీ విజయ్ ని మీడియా కవర్ చేసేందుకు ఆయన డ్రైవర్ మరియు బాడీ గార్డ్స్ చాలా ప్రయత్నించారు. ఆయన ఈ విషయమై ఎలా స్పందిస్తాడో అనేది చూడాలి.

ఎంతగా దాచాలని చూసినా కూడా బింబిసార రోజు విజయ్ ఎవరి కంట పడలేదు కాని కార్తికేయ 2 సినిమా చూసిన రోజు మాత్రం మీడియా కంట పడ్డాడు. విజయ్ హైదరాబాద్ లో ఉండి వరుసగా తెలుగు సినిమాలను చూస్తూ షూటింగ్ లో పాల్గొంటూ చిల్ అవుతున్నాయి. ఏ ఇతర భాషల సినిమాలు కూడా సక్సెస్ అవ్వలేదు. కనుక తెలుగు సినిమాలను ఆయన చూడాల్సి వచ్చిందని సోసల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ద్వి భాష సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మరో వైపు విజయ్ తన కొత్త సినిమా ను లోకేష్ కనగరాజ్ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.