Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: ఆ దర్శకుడు కిరాణ కొట్టు పెట్టాడు

By:  Tupaki Desk   |   4 July 2020 11:50 AM GMT
కరోనా ఎఫెక్ట్: ఆ దర్శకుడు కిరాణ కొట్టు పెట్టాడు
X
కరోనా ఎంతటి పనిచేసింది. ఉద్యోగాలు, ఉపాధి దూరం చేసింది. అందరినీ రోడ్డున పడేసింది. అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితం అయ్యింది సినిమా పరిశ్రమనే. ఇప్పటికీ ఆ రంగం ఇంకా పునరుద్ధరణ కాలేదు. థియేటర్స్ ఓపెన్ కాలేదు. షూటింగ్ మొదలవుతాయో లేదో తెలియదు.

ప్రస్తుతం స్టార్ హీరోలంతా కరోనా భయానికి షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా అన్ని బంద్ చేసి ఇంట్లో ఉంటున్నారు. సినీ కార్మికులు పస్తులుంటున్నారు. ఆకలికేకలతో వేరే దారులు వెతుక్కుంటున్నారు.

తాజాగా ఓ తమిళ దర్శకుడు ఆనంద్ పరిస్థితి దుర్భరంగా మారింది. చేతిలో పనుల్లేక.. షూటింగ్ లు మొదలు కాక డబ్బులన్నీ అయిపోవడంతో చేసేదేం లేక ఓ కిరణాషాపు పెట్టుకున్నాడు.

పదేళ్లుగా తమిళ దర్శకుడు ఆనంద్ సినీ పరిశ్రమలో ఉంటున్నాడు. ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’, మౌనా మజాయ్’ వంటి సినిమాలతో దర్శకుడిగా ఆనంద్ కు పేరొచ్చింది. ప్రస్తుతం తునింతు సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో డబ్బుల్లేక పని లేక ఇలా ఆనంద్ కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. ఆనంద్ పరిస్థితే ఇలా ఉంటే ఇక కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు ఆనంద్.. ఇప్పట్లో ఇండస్ట్రీ , థియేటర్స్ తెరిచే పరిస్థితులు లేవని.. కాసింత డబ్బుతో చెన్నైలోని మౌలివాక్కంలో ఫ్రెండ్ కు చెందిన ఓ షట్టర్ కిరాయికి తీసుకొని కిరాణ షాపు పెట్టానని తెలిపాడు. చెన్నై, తమిళనాడు లో కరోనా తీవ్రంగా ఉందని..అన్నింటిని బంద్ చేశారని.. ఒక్క కిరాణాషాపులకు మాత్రమే అనుమతి ఉందని.. అందుకే ఉపాధి కోసం ఇది పెట్టుకున్నానని తెలిపాడు.