Begin typing your search above and press return to search.

దీపావళి బరిలో స్టార్ వార్ జరుగనుందా?

By:  Tupaki Desk   |   31 May 2021 9:39 AM GMT
దీపావళి బరిలో స్టార్ వార్ జరుగనుందా?
X
టాలీవుడ్ హీరోల్లో సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంతవరకూ తమ సినిమాలను 'సంక్రాంతి' బరిలో నిలపాలని హీరోలు ఉత్సాహం చూపుతుంటారు. సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టడటం అనేది ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని అంటూ ఉంటారు. ఇక కోలీవుడ్ హీరోల విషయానికి వస్తే వారు 'దీపావళి' పండుగపై ఎక్కువ దృష్టిపెడతారు. దీపావళి కానుకగా తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటారు. అభిమానులంతా కూడా ఈ విషయంలో మరింత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

రజనీకాంత్ తాజా చిత్రంగా 'అన్నాత్తే' రూపొందుతున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ పుష్కలంగా ఉండనున్నాయి. నయనతార .. ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. రజనీ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.

ఇక ఇదే సమయంలో ఒక వైపున అజిత్ సినిమా 'వాలిమై' .. మరో వైపున విజయ్ 65వ సినిమా రూపొందుతున్నాయి. ఈ ఇద్దరికీ కూడా తమిళనాట విపరీతమైన మాస్ ఇమేజ్ ఉండటం విశేషం. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'వాలిమై'లో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. విజయ్ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ రెండు సినిమాలను కూడా దీపావళికి రిలీజ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. అందువలన ఈ సారి కోలీవుడ్ లో స్టార్ వార్ తప్పదేమోనని చెప్పుకుంటున్నారు.