ఫొటోటాక్ : బర్త్ డే వేడుకలో లెజెండ్రీ డైరెక్టర్స్

Mon Sep 21 2020 19:30:36 GMT+0530 (IST)

PhotoTalk: Legendary Directors at Birthday Celebration

ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ 49వ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మిస్కిన్ బర్త్ డే వేడుకలకు ప్రముఖ దర్శకులు హాజరు అయ్యారు. ఈసారి కేవలం డైరెక్టర్స్ స్పెషల్ అన్నట్లుగా కోలీవుడ్ కు చెందిన లెజెండ్రీ డైరెక్టర్స్ అంతా ఒక్క చోట కూడారు. మిస్కిన్ తో బర్త్ డే కేక్ ను కట్ చేయించారు. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. పూర్తిగా ఒక ప్రైవేట్ పార్టీగా సాగిన ఈ బర్త్ డే వేడుకను స్వయంగా మణిరత్నం ఏర్పాటు చేశాడని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.మణిరత్నం స్వయంగా దర్శకుడు శంకర్.. లింగు స్వామి.. గౌతమ్ వాసు దేవ్ మీనన్.. ఇంకా ప్రముఖులను ఆహ్వానించి మరీ మిస్కిన్ కు బర్త్ డే పార్టీ నిర్వహించడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఈమద్య కాలంలో స్టార్ డైరెక్టర్స్ అంతా కూడా కరోనా కారణంగా ఖాళీగా ఉన్నారు. అందరు ఇలా ఒకసారి కలిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు మణిరత్నం ఇలా ప్లాన్ చేసి ఉంటాడు అంటూ కొందరు భావిస్తున్నారు. ప్రముఖ దర్శకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వెనుక ఉద్దేశ్యం మరేదైనా ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.