రాక రాక హిట్టొస్తే తమిళ రాకర్స్ పాలైంది!

Sun May 22 2022 08:00:01 GMT+0530 (IST)

Tamil Rockers Bhol Bhuliya 2

అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన హారర్-కామెడీ భూల్ భూలయ్యా 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కల్ట్ క్లాసిక్ భూల్ భూలయ్యా ఫ్రాంచైజీలో ఇది రెండవ భాగం కావడంతో బోలెడంత హైప్ నెలకొంది.  రిలీజ్ ముందు నుంచీ ఈ చిత్రంపై చాలా బజ్ ఉంది.  దాదాపు రూ. 65 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన భూల్ భూలయ్యా 2 ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద కంగనా రనౌత్ నటించిన ధాకడ్ తో ఢీకొడుతూ విడుదలైంది. చాలా కాలం తర్వాత భూల్ భులయా2 రూపంలో బాలీవుడ్ కి హిట్ దక్కిందంటూ పాజిటివ్ సమీక్షలు దక్కాయి. ఇక ఈ మూవీ రోజుకు 20కోట్లు చొప్పున వసూలు చేస్తూ వీకెండ్ నాటికే సేఫ్ అవుతుందని అంచనా.ఇక ఈ సినిమాలోని ప్రధాన తారలు తమ పాత్ర కోసం తీసుకున్న పారితోషికాలు ఎలా ఉన్నాయి? అంటే షాకిచ్చే విషయాలు తెలిసాయి. భూల్ భూలయ్యా 2 కోసం కార్తీక్ ఆర్యన్ తన రెమ్యునరేషన్‌గా రూ. 15 కోట్లు వసూలు చేసారట. కాగా ఈ సినిమాలో తమ పాత్రల కోసం కియారా అద్వానీకి రూ.4 కోట్లు.. సీనియర్ నటి టబుకి రూ.2 కోట్లు పారితోషికం చెల్లించారని టాక్ వినిపిస్తోంది.

దీనికి తోడు ఒరిజినల్ సినిమాలో భాగమైన నటుడు రాజ్‌పాల్ యాదవ్ కామెడీ డ్రామాలో పూజారి పాత్ర పోషించినందుకు 1.25 కోట్లు వసూలు చేశాడు. ఇతర నటులు సంజయ్ మిశ్రా -అమర్ ఉపాధ్యాయ్ లకు వరుసగా రూ.70 లక్షలు .. రూ. 30 లక్షలు చెల్లించారు. సినిమాలోని మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే నటుడు మిలింద్ గునాజీ భూల్ భూలయ్యా 2తో సినిమాల్లో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం రూ. 5 లక్షలు వసూలు చేశాడు.

అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్  T-సిరీస్ పతాకంపై  నిర్మించారు. భూల్ భూలయ్యా 2 కేవలం ముందస్తు బుకింగ్‌ల నుండి దాదాపు రూ. 6.9 కోట్లను ఆర్జించగా  తొలిరోజు వసూళ్లతో కలుపుకుని 20కోట్లు వసూలు చేసింది.

భూల్ భులయా కి పైరసీ పంచ్

చక్కని హిట్ టాక్ తో రన్ అవుతున్న భూల్ భులయాకు పైరసీ పంచ్ పడింది. ఈ మూవీ పూర్తి HD డౌన్ లోడ్ కోసం ఆన్ లైన్ లో లింకులు అందించడం షాకిస్తోంది.  కార్తీక్ ఆర్యన్- కియారా అద్వానీల భూల్ భూలయ్యా 2 మే 20న విడుదలైంది. నెటిజన్లు విమర్శకులు ఈ చిత్రంపై క్రేజీగా ఉన్నారు. అభిమానులు భూల్ భూలయ్యా 2ని కంప్లీట్ ఎంటర్‌టైనర్ సమ్మర్ విన్నర్ అంటూ కితాబిచ్చారు. అయితే భూల్ భూలయ్యా 2 చిత్రం విడుదలైన మొదటి రోజునే పైరసీకి తాజా బాధితురాలిగా మారడంతో నిర్మాతలకు బ్యాడ్ న్యూస్ గా మారింది. కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ చిత్రాన్ని గొప్ప క్వాలిటీ వెర్షన్ లీక్ చేయడంతో ఆందోళన నెలకొంది. తమిళ్‌రాకర్స్- టెలిగ్రామ్ మరియు మూవీరుల్జ్ లో దీనిని అందుబాటులోకి తెచ్చారు.

భూల్ భూలయ్యా 2 చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు .. ఆకాష్ కౌశిక్ రచించారు. 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కి విడుదలైంది. భూల్ భూలయ్యా 2017లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన కామెడీ-హారర్ చిత్రం సీక్వెల్ ఫలితం ఎలా ఉంటుందా? అన్న క్యూరియాసిటీ కూడా జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది.

తాజాగా పైరసీ లీకుల వల్ల కొంతవరకూ బాక్సాఫీస్ కలెక్షన్‌పై ప్రభావం పడవచ్చు. Tamilrockers Telegram మరియు Movierulz తాజా విడుదలలను లీక్ చేసే పైరసీ వెబ్ సైట్ లు అన్నది తెలిసిందే. అయితే సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ కావడం ఇదే మొదటిసారి కాదని గ్రహించాలి. హీరోపంతి 2- రన్‌వే 34- కాతువాకుల రెండు కాదల్- ఆచార్య- 83 వంటి అనేక చిత్రాలు బాధితుల జాబితాలో ఉన్నాయి.

ఈ టాప్ పైరసీ సైట్లపై ప్రభుత్వం అనేక సార్లు కఠిన చర్యలు తీసుకుంది. కానీ వారు ఇబ్బంది పెట్టడం ఆపలేదు. తమిళ్ రాకర్స్ సైట్ ని ప్రతిసారీ బ్లాక్ చేస్తుంటే ప్రతిసారీ సైట్ వెనుక ఉన్న బృందం కొత్త డొమైన్ తో కనిపిస్తోందన్న లీకు కూడా ఉంది. సైట్ నిషేధించిన ప్రతిసారీ తమిళ రాకర్స్ కొత్త డొమైన్ ను తీసుకుంటారు. తాజాగా విడుదల చేసిన సినిమాల పైరేటెడ్ వెర్షన్ లను ఇందులో అప్ లోడ్  చేస్తారు. తమిళరాకర్స్ పైరసీ మాఫియాగా అందరికీ ఇలా షాక్ లిస్తూనే ఉంది.

ఎవరైనా ఏ రకమైన పైరసీని ప్రోత్సహించకూడదు లేదా మద్దతు ఇవ్వకూడదు. పైరసీ అనేది 1957 కాపీరైట్ చట్టం ప్రకారం క్రిమినల్ నేరం. ఏ రూపంలోనైనా పైరసీలో పాల్గొనడం లేదా ప్రోత్సహించడం మానుకోవాలని అభ్యర్థిద్దాం.