Begin typing your search above and press return to search.

తమన్నా రూట్ మారిపోయినట్టే!

By:  Tupaki Desk   |   7 May 2021 6:30 AM GMT
తమన్నా రూట్ మారిపోయినట్టే!
X
పాలమీగడ .. పచ్చిపసుపు కలిపి తయారు చేసినట్టుగా కనిపించే తమన్నాను చూస్తే, కెమెరానే హ్యాండిల్ తిప్పితే ఊరుకోదు. ఇక వయసులో ఉన్న కుర్ర ఆడియన్స్ ఊరుకుంటారా? దానిమ్మ మొగ్గలా .. మోదుగు పూవులా కలర్ ఫుల్ గా కనిపించే ఈ అందమైన అమ్మాయిని అదేపనిగా చూసి ఎంతమందికి సైట్ వచ్చి ఉంటుంది? తెరపై పాలధారలా జారిపోయే ఈ పిల్ల సౌందర్యాన్ని కళ్లతో దొరికించుకోవడమే కష్టమైపోతోందని చెప్పేసి, వెంటనే మరో ఆటకు అదే థియేటర్లోకి ఎంతమంది దూరేవారు?

తమన్నా గ్లామర్ లో ఆమె మేని ఛాయ .. స్కిన్ టోన్ .. ఫిట్ నెస్ .. లావణ్యం ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. గ్లామర్ తో పాటు తమన్నా నటన పై కూడా దృష్టి పెట్టింది. అంతేకాదు డాన్స్ విషయంలోను శ్రద్ధ చూపింది. తనకున్న గ్లామర్ చాలు .. ఓ నాలుగు సినిమాలు చేసుకుని వెళ్లిపోవడానికి అని ఆమె అనుకోలేదు. కెరియర్ ను ఒక తపస్సులా భావించి ఆంకితభావంతో ఆమె కష్టపడటం వల్లనే, చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ నిలిచింది.

అలాంటి తమన్నాకి ఇప్పుడు కొత్త హీరోయిన్ల జోరును తట్టుకుని నిలబడటం కష్టమైపోతోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో 'ఎఫ్ 3' మాత్రమే కాస్త చెప్పుకోదగిన ప్రాజెక్టుగా కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె వెబ్ సిరీస్ లపై దృష్టిపెట్టింది. ఆమె ప్రధాన పాత్రధారిగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలోనే రెండు వెబ్ సిరీస్ లు రూపొందడం విశేషం. ఇక సినిమాల్లోను గ్లామర్ రోల్స్ కాకుండా, క్రైమ్ థ్రిల్లర్లు .. సస్పెన్స్ థ్రిల్లర్లు ... హారర్ థ్రిల్లర్లు చేసుకుంటూ వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె ఉందని చెప్పుకుంటున్నారు. అంటే నాయిక ప్రాధాన్యత గల ఈ తరహా సినిమాలను చేస్తూ, నయనతార .. త్రిష బాటలో నడవాలనుకుంటోందన్న మాట!