Begin typing your search above and press return to search.

కొత్త క్రష్ కు స్టార్ డమ్ కు భలేగా ముడేసిందిగా?

By:  Tupaki Desk   |   23 Jun 2021 5:30 AM GMT
కొత్త క్రష్ కు స్టార్ డమ్ కు భలేగా ముడేసిందిగా?
X
కాలంతో వచ్చే మార్పులు కొందరు ఆహ్వానిస్తారు. కొందరు గుర్తించనట్లు ఉండిపోతారు. ఎవరైతే కాలంతో పాటు మార్పుకు ఓకే చెబుతారు.. వారు కొనసాగుతూ ఉంటారు. ఒకప్పుడు సినిమాలు తప్పించి నటీనటులకు మరో అవకాశం ఉండేది కాదు. తర్వాతి కాలంలో యాడ్స్ చేసే అవకాశం రావటం.. ఆ తర్వాత బుల్లితెర మీద ప్రత్యేక షోలు చేసే ఛాన్సు వచ్చింది. ఇప్పుడు అందుకు భిన్నంగా కొత్తగా ఓటీటీ ఫ్లాట్ ఫాం వచ్చేసింది.

దీంతో.. టాలెంట్ విశ్వవ్యాప్తంగా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే వీక్షించే వెసులుబాటు లభిస్తుంది. ఓటీటీలో స్టార్ డమ్ కంటే కూడా కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ మధ్యనే ఓటీటీ ఫ్లాట్ ఫాం మీదకు వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా..దాని మీద విపరీతమైన క్రష్ ను ప్రదర్శిస్తున్నారు. పాత్రపరంగా కొత్తదనాన్ని చూపించటంతో పాటు ప్రతిభకు మెరుగులు దిద్దుకోవటానికి ఓటీటీకి మించిన వేదిక మరొకటి లేదంటున్నారు.

ఈ మధ్యనే ఆమె చేసిన లెవన్త్ అవర్ అంత పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా తమిళంలో మరో ఓటీటీ సీరిస్ చేసింది. ఇలాంటివేళ.. ఓటీటీ రేంజ్ ఎంతో చెప్పుకొచ్చింది. గతంలో స్టార్ డమ్ అనే భావన ఉండేదని.. ఇప్పుడు దానికి చెల్లుచీటి పడిందని పేర్కొంది. పదేళ్ల క్రితం పరిస్థితులు వేరుగా ఉండేవని.. తమ అభిమాన నటీనటుల కోసం అభిమానులు ఎన్ని రోజులైనా వెయిట్ చేసే వారని.. ఓటీటీ ఎంట్రీతో ఆ పరిస్థితి మారిందన్నారు.

కంటెంట్ సినిమాల్ని శాసిస్తుందని చెబుతున్న ఆమె..సినిమాలకు భిన్నంగా వినూత్న కథల్ని ఎంపిక చేసుకోవటానికి ఓటీటీ గొప్ప మార్గంగా కనిపిస్తోందని చెప్పారు. చూస్తుంటే.. ఓటీటీ మీద మిల్కీ బ్యూటీ క్రష్ ఎంత ఎక్కువగా ఉందన్న విషయం తాజా మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.