మిల్కీ వైట్ బ్యూటీ అందాల ట్రీట్

Tue Nov 30 2021 14:36:56 GMT+0530 (IST)

Tamannah Flaunts her Beauty in Picture

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కెరీర్ రెండు దశాబ్ధాలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. 30 ప్లస్ ఏజ్ లో ఇప్పటికీ ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. అందానికి అందం నటనలో తనదైన చొరవతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో కెరీర్ పరంగా ఎదురేలేని స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం తెలుగు-తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వెబ్ టీవీ షోలతోనూ ప్రణాళికల్లో వేగం చూపిస్తోంది.వీటన్నిటినీ మించి మిల్కీ బ్యూటీ సోషల్ మీడియా ప్రచారంలోనూ ఇతర భామలకు ధీటుగా పోటీపడుతోంది. తమన్నా షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. ఆన్ లొకేషన్ మిల్కీ టూపీస్ లుక్ లో కుర్రకారుకు మతి చెడే ట్రీట్ నే ఇచ్చింది. అలా నాభి అందాలను ఎలివేట్ చేస్తూనే థై -థండర్ షోస్ తో నెవ్వర్ బిఫోర్ అనే ట్రీటిచ్చింది ఈ బ్యూటీ. లొకేషన్ లో చిన్నపాటి గ్యాప్ లో అలా జోవియల్ గా నవ్వేస్తూ వాక్ చేసుకుంటూ వస్తున్న తమన్నా ఫోటోగ్రాఫ్ ని కెమెరామెన్ క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైరల్ గా షేర్ అవుతోంది.

పొట్టి నిక్కర్లు బికినీల్లో కనిపించడం తమన్నాకు కొత్తేమీ కాదు కానీ.. మరీ ఈ రేంజులో చెలరేగడం సంథింగ్ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇంతకుముందు గోపిచంద్ సరసన సీటీమార్ లో జ్వాలారెడ్డిగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తదుపరి తమన్నా నటించిన చిత్రాలు వరుసగా రిలీజ్ కి రావాల్సి ఉంది. తాజా లుక్ ఎఫ్ 3 సెట్స్ నుంచి షేర్ చేసినది. ఇదే సెట్స్ నుంచి ఇంతకుముందు అరటి ఆకు లో అల్పాహారం సేవిస్తున్న ఫోటోగ్రాఫ్ ఆన్ లొకేషన్ నుంచి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇడ్లీ- దోసె - వడలను రుచికరమైన చట్నీతో కలుపుకుని మరీ తమన్నా తింటోంది. తమన్నా దేవతగా మారి తన భర్త వెంకీని వెంబడించే క్రాక్ వైఫ్ గా కనిపిస్తుందట. ఎఫ్ 3 చిత్రంలో ఒక ఫన్నీ సన్నివేశం కోసం చిత్రీకరణ పూర్తి చేసారు. ఇప్పుడు మరో అల్ట్రా గ్లామరస్ లుక్ వైరల్ అయ్యింది.