Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పూల్ లో మొహం ఎర్రగా కందిపోయిందే!

By:  Tupaki Desk   |   24 April 2019 6:21 AM GMT
ఫోటో స్టొరీ: పూల్ లో మొహం ఎర్రగా కందిపోయిందే!
X
మిల్కీ బ్యూటీ తమన్నాకు గత ఏడాది పరాజయాలు పలకరించాయి కానీ ఈ ఏడాది మాత్రం సూపర్ గా స్టార్ట్ అయింది. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన F2' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో తమన్నా ఒక్కసారిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. అయినా ఫ్లాపులు వచ్చినప్పుడు తమన్నా కెరీర్ క్లోజ్ అని గుసగుసలు వినిపించడం.. అలా విమర్శల జోరు పెరిగిన సమయంలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావడం తమన్నాకు చాలా చాలా కామన్. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో తమన్నా ఈత కొలనులో జలకాలాడుతూ సేదదీరుతోంది. నీటిపై తేలుతూ ఉన్న ఒక అందమైన పువ్వు తమన్నాకు దొరకడంతో దాన్ని అటూ ఇటూ కదలనివ్వకుండా తన అరచేతిని దానికి ఒక కుర్చీలా పెట్టింది. అసలే మిల్కీ బ్యూటీ.. అలా తనను కదలనివ్వకపోవడంతో పాపం ఆ పువ్వు ఏం చేయగలుగుతుంది? జస్ట్ అలా తమ్మూని ఆరాధనగా చూస్తూ కదలకుండా కుదురుగా ఉండిపోయింది. ఇక తమన్నా కూడా ఆ పువ్వును తదేకంగా చూస్తూ ప్రకృతి ప్రేమికురాలిగా మారిపోయింది. ఇదిలా ఉంటే నీటిలో ఈత కొట్టి కొట్టి తమన్నా మొహం ఎర్రగా కందిపోయినట్టు కనిపించడం ఈ ఫోటోలో మరో ప్రత్యేకత. ముట్టుకుంటే కందిపోయేలా అసలు ఆ కలర్ ఏంటి బాబోయ్? ఇలాంటి బ్యూటీలను చూస్తేనే కవులు "ఏమెట్టి చేశాడే ముద్దుగుమ్మ నినను ఆ బ్రహ్మా... టీ టీ టీ" అంటూ రెచ్చిపోయి కవిత్వం రాసేది.

అయినా సమ్మర్ వస్తే చాలు ఈ బ్యూటీలందరూ నాటీ డ్రెస్సులు వేసుకొని ఈత కొలనులో దిగడం.. జలకాలడడం.. ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం. సూపర్ డ్యూటీ కదా. ఈ ఫోటోకు తమన్నా వేదాంత ధోరణిలో క్యాప్షన్ ఇచ్చింది.."జీవితంలో అతి మథురమైనవి చిన్న చిన్న విషయాలే.. అవే నిజమైనవి కదా - లారా ఇంగాల్స్ వైల్డర్". ఇంతకీ ఆ లారా ఎవరని అనుకుంటున్నారా? ఆమె ఒక అమెరికన్ రచయిత్రి. ఒక శతాబ్దం క్రితం ఆమె ఎన్నో పుస్తకాలు రాసింది.