మార్నింగ్ 'సలైవా' ఫేస్ ప్యాక్.. నా బ్యూటీ సీక్రెట్: తమన్నా

Fri Jun 18 2021 18:00:01 GMT+0530 (IST)

Tamannaah reveals her beauty secret

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్కిన్ కేర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు మిల్కీబ్యూటీ తమన్నా. ఈ బ్యూటీ మాములు అందగత్తె కాదనే విషయం అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడుస్తున్నా అమ్మడు ఇంకా స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ కాపాడుకుంటుంది. ఈ గ్లామరస్ బ్యూటీ ఫలానా ఇండస్ట్రీ అనే తేడాలేకుండా అవకాశం వచ్చిన ప్రతి చోటా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. అభిమానులు ముద్దుగా మిల్కీ బ్యూటీగా పిలుచుకునే తమన్నా.. స్టార్డం అందుకుంది మాత్రం తెలుగులోనే అని చెప్పాలి.ఇన్నేళ్ళలో తమన్నా అందం ఏమాత్రం మారలేదు. ఎంత నాజూకుగా సినిమాల్లో అడుగుపెట్టిందో ఇప్పటికి అదే నాజూకు వయ్యారంతో ఆకట్టుకుంటుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పుకునే హీరోయిన్స్ లో తమన్నా ముందే ఉంటుంది. ఈ భామ ఎన్ని షూటింగ్స్ ఉన్నప్పటికి ఖచ్చితమైన డైటింగ్.. క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తోంది. లాక్డౌన్ సమయానికి ముందు అమ్మడు కాస్తా బొద్దుగా కనిపించింది. కానీ లాక్డౌన్ లో ఈ వయ్యారి మేనికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు అదే నాజూకు సోయగంతో అందరికి మతులు పోగొడుతుంది.

మరి ఇన్నేళ్లుగా మేకప్ ఉన్నా లేకపోయినా తమన్నా అందంలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే స్మూత్ స్కిన్ తో ఎల్లప్పుడూ చర్మసౌందర్యంలో నిగనిగలాడుతూ ఉంటుంది. తాజాగా అమ్మడు యూత్ కు ఓ ఇంపార్టెంట్ టిప్ చెప్పింది. మీరు మీ ముఖ సౌందర్యం కోసం స్పెషల్ (భయంకరమైన) ఫేస్ ప్యాక్.. ఏంటి? అని అడిగిన ప్రశ్నకు అమ్మడు క్రేజీ ఆన్సర్ చెప్పింది. అయితే తాను ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను అప్లై చేస్తానని చెప్పి షాకిచ్చింది. అలాగే స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో సలైవా బాగా పని చేస్తుందని తెలిపింది. అయితే సలైవా మంచిదే కానీ యంగ్ గర్ల్స్ మాత్రం ఇతర స్కిన్ ప్రాబ్లెమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ ను కలవడం బెటర్ అని అంటోంది. అమ్మడు ఇటీవలే నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే త్వరలో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ద్వారా టీవీ తెరపై కనిపించనుంది.