అరటి ఆకులో ఆరగిస్తున్న మిల్కీ దేవత

Wed Nov 24 2021 21:00:01 GMT+0530 (IST)

Tamannaah Latest Photo

ఫైవ్ స్టార్ హోటల్లో ఉప్పు లేని పప్పన్నం తినడం వేరు.. ఇంట్లో అరటి ఆకులో వడ్డించుకుని తినడం వేరు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అందాల దేవత ఆ రెండో పనే చేస్తోంది. చక్కగా అరటి ఆకులో వడ్డించుకుని మరీ తింటోంది. అలా తింటూ తననే చూస్తున్న వారి నోరూరించేస్తోంది.ఇలా నల్లచీరలో కిరీటధారియై బరువైన ఆభరణాలతో ప్రత్యక్షమైన మిల్కీ దేవత ఎంతో అందంగా ముచ్చటగా కనిపిస్తోంది. ఒళ్లంతా కేజీల కొద్దీ ఆభరణాల వెయిట్ ని బాగానే ఓపిగ్గా కనిపిస్తోంది. ఇక ఆ ముక్కుకు ముక్కెర ఎంతో అందంగా అమిరింది. ముంబై బ్యూటీ ఇలా అరటి ఆకులో ఆరగించడం నిజంగానే తెలుగు ఆడియెన్ కి స్పెషల్ ట్రీట్. అరటి ఆకులో భోజనం చేస్తే సర్వరోగ నివారిణి అని అంటారు. ఇది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం.

మిల్కీ గాడెస్ అరటి ఆకు లో అల్పాహారం సేవిస్తోంది. ఇడ్లీ- దోసె - వడలను  రుచికరమైన చట్నీతో కలుపుకుని మరీ తింటోంది. ఏదైనా ఆభరణాల ప్రకటన లేదా టీవీ షో కోసం షూట్ లో పాల్గొందా? అన్నది ఆరా తీస్తే.. ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ లుక్ వెనక అసలు కథే వేరు. వాస్తవానికి తమన్నా దేవతగా మారి తన భర్త వెంకీని వెంబడించే క్రాక్ వైఫ్ గా కనిపిస్తుందట. ఎఫ్ 3 చిత్రంలో ఒక ఫన్నీ సన్నివేశం కోసం చిత్రీకరణ సాగుతోంది. సినిమాలోని ఈ చిన్న కామెడీ సీన్ కోసం మెహ్రీన్ కూడా అదే రూపంలో కనిపించే అవకాశం ఉందట. ఫ్యాషన్ డిజైనర్ నిషికా లుల్లా సహా పలువురు స్టార్లు మిల్కీ గెటప్ పై స్పందించారు. లవ్ ఈమోజీలను షేర్ చేశారు. ఇక తమన్నా ఇటీవల ఎఫ్ 3 పైనే దృష్టి సారించింది. తను నటించిన పలు చిత్రాలు విడుదలకు రావాల్సి ఉంది.