మెగా హీరోకు డాన్స్ ఛాలెంజ్ చేసిన హీరోయిన్

Sat Jan 29 2022 14:00:01 GMT+0530 (IST)

Tamanna dance challenge to the mega hero?

సోషల్ మీడియాలో ఒక్కో సమయంలో ఒక్కో ఛాలెంజ్ లు కొనసాగుతూ ఉంటాయి. ఐస్ బక్కెట్ ఛాలెంజ్ అప్పట్లో ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుండి ఏదో ఒక ఛాలెంజ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఛాలెంజ్ లను కొందరు ఫిట్ గా ఉండేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు గాను వాడుకుంటూ ఉన్నారు... మరి కొందరు కాలక్షేపం కోసం వాడితే మరి కొందరు తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకునేందుకు కూడా వినియోగించుకుంటున్నారు. ఆమద్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫిట్ గా ఉండటం కోసం యోగం మరియు వర్కౌట్స్ చేయాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇంకా ఆ తర్వాత లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త డాన్సింగ్ ఛాలెంజ్ ను మొదలు పెట్టింది. కొడ్తే బీట్ కు తమన్నా డాన్స్ చేసి ఇదే బీట్ కు మీరు కూడా డాన్స్ చేయండి అంటూ మరో ఇద్దరిని కూడా నామినేట్ చేసింది.గని సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. కొడ్తే.. అనే పల్లవితో సాగే ఈ పాట మాస్ బీట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ఆ బీట్ తో డాన్స్ ను తెగ చేస్తున్నారు. అందుకే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆ బీట్ కు డాన్స్ చేసి తన తర్వాత గని హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ సాయి మంజ్రేకర్ లను నామినేట్ చేయడం జరిగింది. ఆ బీట్ కు వారిద్దరు కూడా డాన్స్ చేసి మరో ఇద్దరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఛాలెంజ్ తో గని సినిమా ప్రమోట్ అవ్వడంతో పాటు పాట కూడా బాగా పాపులర్ అవుతుందని మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఈ ఐటెం సాంగ్ తో గని సినిమా స్థాయి మరింత గా పెరిగింది అనడంలో సందేహం లేదు.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించిన గని సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని బాక్సింగ్ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద వరుణ్ తేజ్ ట్రైనింగ్ అయ్యాడు. ప్రముఖ స్టార్స్ ఈ సినిమాలో నటించడం వల్ల గని సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే సమయంలో వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమా లు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక తమన్నా హీరోయిన్ గా మరియు ఐటెం సాంగ్స్ ను సమానంగా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అలాంటి తమన్నా ఛాలెంజ్ ను వరుణ్ తేజ్ ఎలా స్వీకరిస్తాడు.. ఆయన ఎవరిని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది అనేది చూడాలి.