ఫోటో స్టొరీ: మిల్కీ బ్యూటీ.. బ్యాక్ వ్యూ!

Wed Sep 11 2019 11:42:56 GMT+0530 (IST)

Tamanna Shows Her Back

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్ఛి ఇన్నేళ్ళయినా ఇంకా అవకాశాలు సాధిస్తూ అప్పుడప్పుడూ హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ ఉండడం ఆశ్చర్యమే.  ఫేడ్ అవుట్ అయిందని వార్తలు రావడం.. అంతలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడం కూడా తమన్నాకు చాలా కామన్.  ఇక గ్లామర్ విషయం మాట్లాడుకుంటే తమన్నా తన మొదటి సినిమాలో ఎలా ఉందో సరిగ్గా ఇప్పుడు కూడా అదే గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ న్యూ జెనరేషన్ హీరోయిన్లకు గట్టిగా పోటీ ఇస్తోంది.సోషల్ మీడియాలో తమన్నా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే.  తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "అమెరికా.. రెడీనా???  #రంగ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ రంగ్ ఏంటి అనుకుంటున్నారా?.. తమన్నా సినిమాల్లో నటించడం కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. త్వరలో 'రంగ్' అనే పేరుతో అమెరికాలో డ్యాన్స్ టూర్ కు రెడీ అవుతోంది.  ఈ ట్రిప్ లో భాగంగా అమెరికాలో బోస్టన్.. ట్రెంటన్.. వాషింగ్ టన్.. న్యూ జెర్సీ లలో ఈ లైవ్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది.  ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14 నుండి 22 వరకూ సాగుతుంది.  ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా.. మరో బాలీవుడ్ భామ మలైకా అరోరా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  దానికి "మీరు రెడీనా" అని ట్రంపు రాజ్య ప్రజలను అడుగుతోంది.  ఇక ఫోటో విషయానికి వస్తే తమన్నా ఒక విండో దగ్గర నిలబడి ఉంది. వెనక నుంచి ఫోటో తీయడంతో వయ్యారాలను ఒలకబోస్తున్న నయాగరాలా ఉంది. డ్యాన్సు కు ముందు బాడీని స్ట్రెచ్ చేస్తున్నట్టుగా పోజిచ్చింది.

ఈ ఫోటోకు ఫుల్లుగా కామెంట్లు పెట్టారు నెటిజన్లు. "టెడ్డీ బేర్ టెడ్డీ బేర్.. ఇటు తిరుగు"... "ట్రంపూ.. నాకు వీసా కావాలి".. "పర్ఫెక్ట్ బ్యాక్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక తమన్నా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో 'సైరా'.. 'దట్ ఈజ్ మహాలక్ష్మి'.. తమిళంలో విశాల్-సుందర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోంది. 'ఆనందో బ్రహ్మ' తమిళ రీమేక్ లో కూడా నటిస్తోంది.