Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ మరో మెగా ఐటెం సాంగ్‌

By:  Tupaki Desk   |   25 July 2021 9:54 AM GMT
మిల్కీ బ్యూటీ మరో మెగా ఐటెం సాంగ్‌
X
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గింది. స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాకున్నా కూడా బిజీగానే ఈమె ఉంది. సోలో హీరోయిన్‌ గా.. చిన్న సినిమాల్లో హీరోయిన్‌ గా వెబ్‌ సిరీస్ ల్లో ఈమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మరో వైపు ఓటీటీ షో లు బుల్లి తెర షో లు వరుసగా చేస్తూనే ఉంది. ప్రస్తుతం తమన్నా పలు సినిమాల్లో నటించడంతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా గని లో ఐటెం సాంగ్‌ ను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వరుణ్‌ తేజ్ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న గని సినిమా షూటింగ్ స్పాట్ లో తమన్నా కనిపించడంతో ఆమె ఐటెం సాంగ్ ను చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కేజీఎఫ్‌ మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ లను ప్రత్యేక పాత్రలను చేసిన తమన్నా మరోసారి గని సినిమాతో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్నా ఐటెం సాంగ్‌ చేయడం వల్ల ఖచ్చితంగా సినిమా కు మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం.

ఒక వైపు ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తూ.. మాస్టర్ చెఫ్‌ టీవీ షో కు హోస్టింగ్‌ చేస్తున్న తమన్నా అదే క్రమంలో గని సినిమాలో ఐటెం సాంగ్‌ ను కూడా చేస్తోంది. బిజీ బిజీగా తమన్నా కెరీర్‌ సాగుతూ ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే గని సినిమాలో ఐటెం సాంగ్‌ చేసినందుకు గాను భారీగానే పుచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గని సినిమాలో వరుణ్ తేజ్‌ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తో అల్లు అరవింద్‌ పెద్దబ్బాయి అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దుతో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు.