రెడ్ సారీలో మిల్కీబ్యూటీ రంజురంజుగా!

Mon Oct 03 2022 15:00:03 GMT+0530 (India Standard Time)

Tamanna Bhatia Photo Talk

గ్లామర్..ట్యాలెంట్..  హాట్ నెస్ ఇవన్నీ ఒకే ఒరలో ఇమిడితే అదే మిల్కీబ్యూటీ తమన్నా. ఫ్యాషన్స్ పరంగా తమన్నా ఎంపికలు అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్ అవుతాయి. ఎలాంటి ఎంపికలకైనా అమ్మడు వన్నే తేగల సత్తా ఉన్న అందం ఆమె సొంతం. చరమాంకానికి చేరువలో ఉన్నా? ఇంకా అటెన్షన్ డ్రా చేస్తుందంటే?  కారణం బ్యూటీలో ఆ అదనపు క్వాలిటీ అన్నది గు ర్తించాల్సిన అంశం.ఇప్పటికీ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటూ...సహాయ పాత్రల్లో సైతం మెప్పించే ప్రతయ్నం వంటివి తమన్నా క్రెడ్ బిలిటీని మరింత మెరుగుపరుస్తున్నాయి.  తాజాగా మిల్కీబ్యూటీ ఎరుపు చీర అందంలో తళుకులీనింది. రెడ్ కలర్ సారీపై మ్యాచింగ్ జాకెట్ ధరించి కుర్రాళ్లని ఒక్కసారిగా ఎరుపెక్కించింది. చీరందంలో అమ్మడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

రెడ్ హాట్ పాలనురుగు సౌందర్యం మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. సారీ పై డిజైన్ అంతే ఫోకస్ అవుతుంది. రకరకలా భంగిమల్లో అమ్మడి ఫోజులు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మిల్కీ మా గుండెలు కోయకలా? అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

ఎర్ర చీరకే అందం తీసుకొచ్చిన అందాన్ని ఇంకెలా పొగడలో ?  కాస్తా చెప్పమ్మా? అంటూ మతి పోగొట్టుకుంటున్నారు. మిల్కీ చీరందంలో కనిపించడం కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు డిజైనర్ సారీల్లో మెరిసింది. అయినా  నలుపు..ఎరుపు చీర అందం ఎవరినైనా స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది. తమన్నా అదే తీరున హైలైట్ అవుతోందిప్పుడు.

తమన్నా భాటియా కెరీర్ ని పరిశీలిస్తే.. బాహుబలి- సైరా నరసింహ రెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రాలలో నటించి కంబ్యాక్ అయ్యింది. అమ్మడు నటించిన ఇతర తెలుగు సినిమాలు విడుదలకు రానున్నాయి. రొమాంటిక్ డ్రామా 'గుర్తుండ సీతాకాలం' విడుదల కావాల్సి ఉంది.  

బాలీవుడ్ లో మధుర్ భండార్కర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భోలా శంకర్- చోర్ నికల్ కే భాగా - యెన్ ఎండ్రు కాదల్ ఎన్ బెన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే  నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చుడియాన్ లో నూ నటిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.