ఆ ప్రాజెక్ట్ ఉందంటే ఉంది లేదనుకుంటే లేదు..!

Tue Feb 23 2021 05:00:01 GMT+0530 (IST)

Talk about filmmakers focusing on different projects

యంగ్ హీరో నాగశౌర్య - డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో 'ఊహలు గుసగుసలాడే' 'జ్యో అచ్యుతానంద' వంటి సెన్సిబుల్ సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిద్దరి కలయికలో ''ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'' అనే హ్యాట్రిక్ మూవీని అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిబొట్ల నిర్మించే ఈ చిత్రంలో మాళవికా నాయర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ దాదాపుగా పక్కనపెట్టేశారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.అప్పట్లో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేయగా వీసా ప్రాబ్లమ్స్ వచ్చాయని.. అదే క్రమంలో కోవిడ్ రావడంతో చిత్రీకరణకు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాని పక్కన పెట్టలేదని అప్పట్లో మేకర్స్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ ఉందంటే ఉంది లేదనుకుంటే లేదు అనే కామెంట్స్ మళ్ళీ వినిపిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో ఈ సినిమాకు నాగశౌర్య మార్కెట్ ని మించి ఖర్చు పెట్టాల్సి రావడంతో ప్రస్తుతానికి ఈ సినిమాను ట్రాక్ తప్పించి వేరే ప్రాజెక్ట్స్ మీద చిత్ర నిర్మాతలు ఫోకస్ పెడుతున్నట్లుగా టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెడితే దీన్నే నమ్ముకున్న డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ పరిస్థితి ఏంటన్నదే మిలియన్ డాలర్స్ క్వశ్చిన్ మార్క్ అని సినీ వర్గాల్లో కామెంట్స్ వస్తున్నాయి.