Begin typing your search above and press return to search.

అక్కడ ‘హిట్‌’ కొట్టే హీరో కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   15 July 2020 11:30 AM GMT
అక్కడ ‘హిట్‌’ కొట్టే హీరో కన్ఫర్మ్‌
X
విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ దర్శకత్వంలో నాని నిర్మించిన ‘హిట్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంది. ఒక కేసు చుట్టు తిరిగే కథ ఆధారంగా ఈ చిత్రంను రూపొందించారు. హీరో విశ్వక్‌ సేన్‌ ఈ చిత్రంలో ఎంక్వౌరీ ఆఫీసర్‌ గా కనిపించాడు. ఇంట్రెస్టింగ్‌ కథనంతో థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌ లతో సాగిన హిట్‌ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు మరింతగా ఆధరిస్తారనే నమ్మకంతో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మరో నిర్మాతతో కలిసి హిందీలో రీమేక్‌ చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.

హిట్‌ మూవీ హిందీ రీమేక్‌ గురించి చాలా రోజుల క్రితమే క్లారిటీ వచ్చింది. కరోనా రాకుండా ఉంటే ఇప్పటి వరకు హిట్‌ చిత్రం హిందీ రీమేక్‌ షూటింగ్‌ కూడా దాదాపుగా పూర్తి అయ్యేది. కరోనా కారణంగా చాలా నెమ్మదిగా అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా హిట్‌ రీమేక్‌ లో హీరోగా బాలీవుడ్‌ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్‌ ఎంపిక అయ్యాడని తెలుస్తోంది.

వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్న ఈ రీమేక్‌ కు స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందట. ఒరిజినల్‌ వర్షన్‌ కు దర్శకత్వం వహించిన శైలేష్‌ ఈ రీమేక్‌ కు దర్శకత్వం వహించబోతున్నాడట. మీడియం బడ్జెట్‌ తో దిల్‌ రాజు మరో ప్రముఖ నిర్మాత కలిసి ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన రాబోతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.