Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్‌ తెలుగు డైరెక్టర్ బాలీవుడ్‌ డెబ్యూ

By:  Tupaki Desk   |   20 July 2021 5:49 AM GMT
ట్యాలెంటెడ్‌ తెలుగు డైరెక్టర్ బాలీవుడ్‌ డెబ్యూ
X
రానా హీరోగా వచ్చిన ఘాజీ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు దర్శకుడు సంకల్ప్‌ రెడ్డికి జాతీయ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. సంకల్ప్‌ రెడ్డికి ఆ సమయంలో తెలుగు లో వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి. కాని ఈయన మెగా హీరో వరుణ్ తేజ్‌ తో అంతరిక్షం 9000 KMPH తర్వాత తెలుగు లో కనిపించలేదు. పిట్ట కథలు వెబ్‌ సిరీస్ తర్వాత ఈయన బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా అది కాస్త ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది. ప్రముఖ నటుడు విద్యుత్ జమ్వాల్ నిర్మాణంలో సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా ను అధికారికంగా ప్రకటించారు.

బాలీవుడ్‌ లో ఈ మద్య కాలంలో పలువురు స్టార్స్‌ సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తున్నారు. హీరోలు హీరోయిన్స్ ఇంకా దర్శకులు కూడా తమ సొంత బ్యానర్‌ లను షురూ చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ జమ్వాల్ కూడా యాక్షన్ హీరో అనే సొంత బ్యానర్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా కొన్నాళ్ల క్రితం ప్రకటించాడు. బ్యానర్‌ ప్రకటించిన ఆయన కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమాను ప్రారంభించలేక పోయాడు. ఎట్టకేలకు సంకల్ప్‌ రెడ్డితో సినిమాను చేయబోతున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించాడు. వీరి సినిమాకు 'IB 71’ అనే టైటిల్‌ ను కూడా ఖరారు చేశారు.

నిర్మాత విద్యుత్ జమ్వాల్ మాట్లాడుతూ తన నిర్మాణ సంస్థలో మొదటి సినిమాను మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు సంకల్ప్‌ రెడ్డితో మేము చేయబోతున్న ఈ సినిమా ఒక మంచి కథతో ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సంకల్ప్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తాడనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. రిలయన్స్‌ ఎంటర్ టైన్‌మెంట్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ సినిమా టీమ్ వర్క్‌ తో సాగుతుందని.. ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతూ ఈ సినిమా ను తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా మంచి మార్కులను దక్కించుకున్న సంకల్ప్ రెడ్డి వరుసగా సినిమాలను చేయకున్నా కూడా చేస్తున్న సినిమాలతో మంచి మార్కులు దక్కించుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

జాతీయ అవార్డు గ్రహీత అయిన సంకల్ప్‌ రెడ్డి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఖచ్చితంగా ఆయనకు అక్కడ మరింతగా మంచి పేరును తీసుకు వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ లో ఈమద్య కాలంలో మన దర్శకులు మరియు హీరోలు తెగ సందడి చేస్తున్నారు. కనుక ఈ సినిమా తో సంకల్ప్‌ రెడ్డి బాలీవుడ్‌ లో బిజీ డైరెక్టర్‌ గా మారిపోతాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆయనపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్ తో కలిసి సంకల్ప్‌ రెడ్డి చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ ఈయన తెలుగు లో ఎప్పుడు సినిమా చేస్తాడా అంటూ ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు.