హీరోయిన్ తో స్నేహం..ఆఫర్ల కోసం డైరెక్టర్ సిఫార్సు!

Tue Nov 19 2019 20:00:01 GMT+0530 (IST)

Talented Director Helping Young Heroine!

ఆయన ఒక టాలెంటెడ్ ఫిలిం మేకర్. కెరీర్లో భారీ విజయాలు లేవు కానీ అభిరుచి కల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు.  అయితే ఈ దర్శకుడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఓ భామతో ఈయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందట. ఫ్రెండ్షిప్ ఏంటి.. దానికి అర్థం ఏంటి అనే చచ్చుపుచ్చు ప్రశ్నలను మనసులోకి రానివ్వకండి. ఆయన ఇలాంటి లేకి భావాలను అసలు సహించడు.  అయితే దర్శకుడి స్నేహితురాలైన హీరోయిన్ కు ఈమధ్య అవకాశాలు తగ్గడంతో ఈ దర్శకుడు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఫ్రెండ్ కెరీర్ ను సరిదిద్దే పనిలో పడ్డాడట.ఈమధ్యే ఈ దర్శకుడు ఇండస్ట్రీలో ఉన్న ఇతర దర్శకులకు ఫోన్లు చేసి సదరు హీరోయిన్ ను మీ సినిమాలో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడట. ఇప్పటికే ముగ్గురు అప్కమింగ్ డైరెక్టర్లకు.. ఒక సీనియర్ మాసు డైరెక్టర్ కు ఈ రిక్వెస్ట్ కాల్స్ వచ్చాయట. మరి ఆ దర్శకులు ఈ అభిరుచి గల దర్శకుడి అభ్యర్ధనకు విలువ ఇచ్చి ఆ బ్యూటీకి ఆఫర్స్ ఇస్తారా లేదా.. "ఇండస్ట్రీలో ఇట్టాంటివి బోలెడు చూసి చూసి.. జుట్టు నెరిసింది.. బట్టనెత్తి వచ్చింది" అని ఆఫర్లు ఇవ్వకుండా ఊరుకుంటారా అనేది వేచి చూడాలి.

అంతా బాగానే ఉంది ఇతర దర్శకుల సినిమాలలోతన ఫ్రెండును హీరోయిన్ గా తీసుకోమని అడగకపోతే ఈయనే తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా అంటే.. అక్కడే ఉంది కిటుకు. ఆయన ప్రస్తుతం బండ ఫ్లాపులు తీసిన వేడిమీద ఉన్నాడు.  హీరోలు.. నిర్మాతలు ఆ వేడికి వీలైనంత దూరంగా ఉన్నారు.  ఎవరి భయం వారిది..!