Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్ ఇక్కడ బిజీ అవుతుందా ?

By:  Tupaki Desk   |   25 Aug 2019 6:34 AM GMT
సీనియర్ హీరోయిన్ ఇక్కడ బిజీ అవుతుందా ?
X
టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఒకప్పటి హీరోయిన్ టబు కూడా తన రీ ఎంట్రీతో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాతో మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది ఈ ముదురు భామ. ఇందులో ఓ స్పెషల్ రోల్ చేస్తుంది టబు. సినిమాలో టబు పూజకి తల్లిగా నటిస్తుందని సమాచారం. రేపటి నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో అల్లు అర్జున్ - టబు - పూజలపై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు.

నిజానికి టబుకి తెలుగులో ఇది రీ-రీ ఎంట్రీ అవుతుంది . ఎందుకంటే ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ లో 'చెన్న కేశవ రెడ్డి' - 'అందరివాడు' -'ఇదీ సంగతి -'పాండు రంగడు' సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హిందీలో బిజీ అవ్వడం - ఇక్కడ పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో టాలీవుడ్ ని లైట్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ రూపంలో థర్డ్ ఇన్నింగ్స్ కి రెడీ అయింది.

మరి థర్డ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలతో నదియా లాగే టబు కూడా బిజీ అవుతుందా ? 'అల వైకుంఠపురములో'తో మళ్ళీ తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుందా.. తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే. ఈ సినిమాలో టబు క్యారెక్టర్ క్లిక్ అయితే మాత్రం తప్పకుండా ఆమెకు అవకాశాలొస్తాయి అందులో సందేహం లేదు.