బాత్ టవల్ చుట్టుకుని హీటెక్కిస్తున్న వెటరన్ హీరోయిన్

Sun Aug 01 2021 21:19:47 GMT+0530 (IST)

Tabu In Bath Towel

జాతీయ ఉత్తమ నటిగా టబు ప్రపంచానికి సుపరిచితం. దశాబ్ధాల పాటు తెలుగు-హిందీ చిత్రసీమల్లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి ఏం చేసినా సంచలనమే. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న సదరు సీనియర్ నటి హాట్ ఫోటో యువతరంలో వైరల్ గా మారుతోంది. టబు సంథింగ్ హాట్ లుక్ తో కవ్విస్తోంది. ఇక ఈ ఫోటోలో టబు అలా బాత్ టవల్ చుట్టుకుని కనిపిస్తూ అగ్గి రాజేస్తోంది. ఇది ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ కి సంబంధించిన స్టిల్ అనుకోవచ్చా? అంటే.. దానికి ఆన్సర్ తననుంచే రావాలి.టబు ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రంలో నటించింది. అందులో తనదైన అందం డిగ్నిటీతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అంధాధున్ తెలుగు రీమేక్ లోనూ టబు నటించకపోయినా తమన్నా ఆ పాత్రలో నటిస్తోంది. తనకు టబు సూచనలు సలహాలు ఇస్తున్నారట.

అంధాధున్ లో ఆయుష్మాన్ ఖురానా .. టబు.. రాధికా ఆప్టే .. ఇలా ఎవరికి వారు తమ పాత్రల్లో జీవించేయడంతో అందరికీ గొప్ప పేరొచ్చింది. మూడు జాతీయ అవార్డులు సహా ఫిలింఫేర్ లు..ఐఫా.. జీ అవార్డులు గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది అంధాధున్. ఇప్పుడు తెలుగు రీమేక్ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` ఫేం మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. `అంధాధున్` కథాంశం ఇంట్రెస్టింగ్. ఇది బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. నటీనటులకు అవార్డులు గెలుచుకునేందుకు ఆస్కారం ఉన్న గొప్ప స్క్రిప్టు కూడా ఇది. ఇక వెటరన్ నటి టబు మునుముందు అక్కినేని కాంపౌండ్ సినిమాల్లోనూ మదర్ పాత్రల్లో మరిపించనున్నారన్న టాక్ ఎలానూ ఉంది.