యాభైలో కూడా నిన్నే పెళ్లాడతా లుక్స్!

Tue Feb 25 2020 09:00:01 GMT+0530 (IST)

Tabu Glamourous Pose

సీనియర్ హీరోయిన్ టబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరమే లేదు.  అందం.. నటన రెండూ ఉండే అతి తక్కువమంది హీరోయిన్లలో టబు ఒకరు.   టాలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ సినిమాల్లో నటించిన టబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి.  టబు కెరీర్ లో ఒక క్లాసిక్ అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన 'నిన్నే పెళ్లాడతా'.   ఈమధ్యే 'అల వైకుంఠపురములో' లో అల్లు అర్జున్ అమ్మ పాత్రలో నటించింది.ఇప్పడు టబు వయసు 48.  యాభైకి దగ్గరవుతూ ఉంది.  అయినా ఆ అందం.. ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఈమధ్య టబు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఫోటోలో పింక్ చీర.. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఓ మెస్మరైజింగ్ లుక్కిచ్చింది. ఆ ఫిట్నెస్..  హాట్నెస్ చూస్తే ఎవరూ టబు నిజం వయసు చెప్పలేరు.  ఇంతకాలం గ్లామర్ ను పదిలంగా కాపాడుకోవడం  సాధారణమైన విషయమేమీ కాదు. అలాంటి క్లిష్టమైన పనిని ఎంతో సులువుగా చేసిన టబు ఈ జెనరేషన్  హీరోయిన్లకు ఓ ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

టబు కొత్త సినిమాల విషయానికి వస్తే రానా -సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'విరాటపర్వం' లోనూ ఓ కీలకపాత్ర పోషిస్తోంది. హిందీలో 'భూల్ భులయ్యా 2' లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్.. కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.