లైన్లో బన్నీ రానా సినిమాలు.. ఇంకా ఆఫర్లు!

Fri Apr 19 2019 07:00:01 GMT+0530 (IST)

Tabu Gets Huge Offers In Tollywood

సీనియర్ హీరోయిన్లలో టబు కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను ఒక ఊపు ఊపడమే కాకుండా అన్ని భాషలలో నటించి ప్యాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంది. రెండు సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్స్ కూడా అందుకుంది.  పోయినేడాది రిలీజ్ అయిన బాలీవుడ్ ఫిలిం 'అంధా ధున్' లో నటించి తన నటనతో అందరినీ ముగ్ధులను చేసింది.  ఈ ఏడాది కూడా టబు కెరీర్ టాప్ గేర్లో ఉంది.ఈ ఏడాది రిలీజ్ కానున్న రెండు క్రేజీ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.  అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న 'దే దే ప్యార్ దే' లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో టబు ధీ ఫన్నీగా సాగే పాత్ర అని సమాచారం.   ఇది కాకుండా సల్మాన్ ఖాన్ సినిమా 'భరత్' లో కూడా ఒక కీలక పాత్రలలో నటిస్తోంది.  బాలీవుడ్ సినిమాలే కాకుండా క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్టులు కూడా టబుకు లైన్లో ఉన్నాయి.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో బన్నీ కి తల్లిపాత్రలో నటిస్తోంది.  మరోవైపు రానా దగ్గుబాటి- సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'విరాటపర్వం' లో నక్సలైట్లకు సానుభూతిపరురాలిగా వ్యవహరించే సోషల్ యాక్టివిస్ట్ గా నటిస్తోందని సమాచారం.

టాలీవుడ్ లో ఈ రెండు సినిమాలే కాకుండా ఇంకా కొన్ని ఆఫర్లు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే 47 ఏళ్ళ వయసులో టబు కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నట్టే లెక్క.  టబు తన పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటుంది. నటనకు స్కోప్ ఉంటే కానీ ఏ పాత్రకైనా ఒకే చెప్పదు. మరోవైపు టబు లాంటి నటి టీమ్ లో ఉంటే ఏ సినిమాకైనా అది ప్లస్సే అవుతుంది.