విదేశీ బోయ్ ఫ్రెండ్ తో తాప్సీ జోరు

Fri Aug 10 2018 11:54:51 GMT+0530 (IST)

స్వదేశీ బోయ్ ఫ్రెండ్ కంటే విదేశీ బోయ్ ఫ్రెండ్ మిన్న! అంటూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేస్తున్నారు మన కథానాయికలు. శ్రీయ రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్‌ని సైలెంటుగా పెళ్లాడేసింది. ఇప్పుడు హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడేసేందుకు పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా సన్నాహకాల్లో ఉంది. ఇక్కడ నటించినన్నాళ్లు నటించి ఆ తర్వాత విదేశాల్లో సెటిలవ్వాలన్నది ఈ భామల ప్లాన్. ఇప్పుడు అదే కేటగిరీ ప్లాన్స్ లో ఉంది తాప్సీ.ఈ భామ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు - ఒలింపిక్ కాంస్య పతక విజేత మాథ్యాస్ బోతో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆ ఇద్దరూ లేట్‌నైట్ డినర్లు - షికార్లలో కెమెరా కంటికి చిక్కడంతో అప్పట్లో బాలీవుడ్ మీడియా పెద్ద రచ్చ చేసింది. ఆ ఇద్దరి మధ్యా డీప్ లవ్ రన్ అవుతోందని ప్రచారం సాగించింది. ఆ స్నేహం ఇప్పటిది కాదు.. నాలుగేళ్ల నుంచి ఇద్దరి మధ్యా ఏదో ఉంది అన్న ప్రచారం సాగింది. అయితే ఈ ఏడాది ఆరంభమే ఆ ఇద్దరి లవ్ బ్రేకప్ అయ్యిందని తాప్సీ ఒంటరిగా ఉందని మరో కొత్త కథనం హీటెక్కించింది.

కట్ చేస్తే.. అది కూడా నిజం కాదు.. ఇదీ నిజం! అన్న తీరుగా మరోసారి డెన్మార్క్ ఫెలో కం డానిష్ బోయ్‌ఫ్రెండ్‌తో ప్రత్యక్షమై పెద్ద షాకిచ్చింది తాప్సీ. ముంబైలో ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ మాథ్యాస్ బోతో కలిసి డిన్నర్ డేట్‌కెళ్లిన తాప్సీ .. విజిటర్స్ కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మాథ్యాస్ తెల్ల టీషర్టులో కనిపిస్తే - తాప్సీ గోధుమ రంగు డార్క్ మిడ్డీలో కనిపించి షేక్ చేసింది. ఆ ఇద్దరి మధ్యా చెలిమి తాలూకా ఘాడానుభూతి ఆ సన్నివేశంలో ఎలివేట్ అవ్వడంతో ఇక బ్రేకప్ లేనట్టేనని - ప్రేమలోనే ఉన్నారని - మొన్ననే గోవాకి చెక్కేసారని ఆసక్తికర కథనాలతో మరోసారి బాలీవుడ్ హోరెత్తిపోతోంది. ఆ మేరకు ముంబైకి చెందిన ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని వెలువరించడం సంచలనమైంది.