పనికిమాలిన బోయ్ ఫ్రెండ్స్ తో డేట్ కెళ్లా

Thu Jan 27 2022 09:00:02 GMT+0530 (IST)

Taapsee Sensational Comments

బోయ్ ఫ్రెండ్ కి సరికొత్త మీనింగ్ చెబుతోంది తాప్సీ పన్ను. పనికిరాని బోయ్ ఫ్రెండ్ .. పనికి వచ్చే బోయ్ ఫ్రెండ్ అంటూ క్లాసిఫికేషన్ ని తెరపైకి తెచ్చింది. అంతగా తనని హర్ట్ చేసిన బోయ్ ఫ్రెండ్స్ ఎవరై ఉంటారు? అన్నది పక్కన పెడితే...తాప్సీ పన్ను తన మనసులోని మాటను బయటకు చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడదని మరోసారి ప్రూవ్ అయ్యింది.చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో రహస్యాల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ తాప్సీ తన మాజీ స్నేహితులపై తీవ్ర విమర్శలు చేసింది. మీరు ఎప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశారా? అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు తాప్సీ చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశానని చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చింది.

``అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను`` అని నటి బిగ్గరగా నవ్వుతూ చెప్పింది. అంతేకాదు తన విదేశీ బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బోతో రిలేషన్ షిప్ విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి ఓపెనైంది. తన తండ్రి ప్రతిసారీ తనలో ఏదో ఒక తప్పు కనిపెట్టేవారు కానీ మాథ్యూస్ ఎంపిక విషయంలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదని అన్నారు తాప్సీ. ఇద్దరూ గౌరవప్రదమైన సంబంధాన్ని పంచుకుంటారని తాప్సీ ఇటీవల సరదాగా చెప్పింది. అయితే పనికిరాని బోయ్ ఫ్రెండ్స్ అని ఏ కారణంగా అంటోంది తాప్సీ?  ఇంతకుముందు తనకు తొలిచిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడిని ఇలానే తిట్టేసింది ఈ బ్యూటీ. ఇప్పుడిలా స్నేహితులను అంత మాటనేసింది! అంటూ కొందరు గుర్రుమంటున్నారు. ఏరు దాటాక ఇలానే చేస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు.

వృత్తిపరంగా బాలీవుడ్ టాలీవుడ్ రెండు చోట్లా కథ నడపించేస్తోంది ఈ బ్యూటీ. మిషన్ ఇంపాజిబుల్ తో ప్రస్తుతం బిజీగా ఉంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేయాల్సి ఉంది. అలాగే తెలుగు సినిమాలో నటించేందుకు ప్లానింగ్ లో ఉంది. తాప్సీ సొంత నిర్మాణ సంస్థలో సమంత కథానాయికగా ఓ రెండు చిత్రాల్ని నిర్మించే ఆలోచన ఉందని ప్రచారమైంది.