నటవారసుడినే పనికి రాడనేసిందా!

Fri Nov 22 2019 07:00:02 GMT+0530 (IST)

Taapsee Pannu Is Letting Go All The Filters On Neha Dhupia

ఒక్కోసారి వివాదం చెలరేగడానికి నోటి దురద కారణం అవుతుంటుంది. మనసుకు తోచింది నోటికి వచ్చింది ఆర్జీవీలా అనేస్తే ఊరుకుంటారా? ఈగో హర్టయితే అందుకు తగ్గట్టే రియాక్షన్ ఉంటుంది. ఆర్జీవీ లానో.. రంగోలీ కంగన సిస్టర్స్ లానో నోటికి తోచిందల్లా అనేస్తే పడరు ఎవరూ.అయితే వీళ్ల జాబితాలో చేరినట్టే కనిపిస్తోంది తాప్సీ. తనకు తోచింది పబ్లిక్ వేదికలపై అనేస్తూ వేడి పెంచేస్తోంది. తాజాగా నేహా ధూపియా `నో ఫిల్టర్ నేహా` షోలో పాల్గొన్న తాప్సీ నోటికి అడ్డూ ఆపూ లేకుండా తోచింది అనేసింది. ఇంతకీ ఏమంది? అంటే.. బాలీవుడ్ లో నటవారసులకు ఉండే ఛాయిస్ వేరే వాళ్లకు ఉండదని అంది. స్టార్ హీరో అనీల్ కపూర్ వారసుడు హర్ష వర్ధన్ నటించిన తొలి సినిమా డిజాస్టర్ అయ్యింది. అతడు అనీల్ కపూర్ వారసుడు కాకపోయి ఉంటే అసలు రెండో ఆప్షన్ అన్నదే ఉండేది కాదు! అంటూ ఘాటుగానే పదజాలం ఉపయోగించింది తాప్సీ. హర్షవర్ధన్ తండ్రి సీనియర్ హీరో స్టార్ హీరో కాబట్టే అవకాశాలొస్తున్నాయని అంది.

అంత పెద్ద కపూర్ ఫ్యామిలీనే విమర్శించేసింది. నటవారసుడి పేరు పెట్టి సూటిగా విరుచుకుపడింది. దీనిపై సోనమ్ ఏమంటుందో.. అనీల్ కపూర్ ఏమని స్పందిస్తారో చూడాలి. అన్నట్టు యంగ్ హీరో తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తుంటే ఇలా నిరాశపరిచింది తాప్సీ. అనవసరంగా తనపై రాయి విసిరినందుకు తనపై కక్ష తీర్చుకుంటాడేమో!! స్వయంకృషితో ఎదిగాననే గర్వం తాప్సీలో ఓకింత తొణికిసలాడుతోంది. ఇంతకుముందు తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపైనే బాంబ్ పేల్చిన తాప్సీ ఇప్పుడిలా నటవారసుడిని అంది! అంటే మనవాళ్లకు మాత్రం కొత్తగా అనిపించడం లేదు మరి!