పింక్ రీమేక్ లో నివేద-అంజలి.. వేరొక భామ?

Fri Dec 13 2019 10:08:51 GMT+0530 (IST)

పింక్ తెలుగు రీమేక్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారని అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పింక్ ఒరిజినల్ నిర్మాత బోనీకపూర్ దిల్ రాజుతో భాగస్వామిగా కొనసాగనున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గురువారం దిల్ రాజు కార్యాలయంలో రికార్డింగ్ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.ఇందులో కథానాయికలు ఎవరు? అంటే ఓ ముగ్గురి పేర్లు ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో వైరల్ గా వినిపిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ నివేద థామస్.. తెలుగమ్మాయి అంజలి ఈ చిత్రంలో కీలక పాత్రలకు ఓకే అయ్యారట. ఇక ఇందులో మెయిన్ లీడ్ కి ఎవరు? అన్న టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ పాత్రకు పింక్ ఒరిజినల్ లో నటించిన తాప్సీ అయితేనే బావుంటుందని భావిస్తున్నారట.

అయితే ఇందుకు తాప్సీ ఓకే చెబుతుందా లేదా?  పవన్ కల్యాణ్ కాల్షీట్లతో తాప్సీ కాల్షీట్లు సింక్ కుదురుతుందా? అంటూ రకరకాల సందిగ్ధతలు నెలకొన్నాయట. అయితే పవన్ సరసన ఆఫర్ కి తాప్సీ అంగీకరించే అవకాశం ఉంది. ఒకవేళ తాను ఓకే చెబితే ఇదే తొలి మెగా సినిమా అవుతుంది తన టాలీవుడ్ కెరీర్ లో.