యాంకర్ మల్లిక ఇక లేరు

Mon Oct 09 2017 16:08:07 GMT+0530 (IST)

అప్పట్లో కేబుల్ టివి సంచలనాలు సృష్టిస్తున్న వేళ.. అంటే సరిగ్గా 1996 తరువాత.. అప్పుడే బుల్లితెరపైకి వచ్చిన ఒక పాపులర్ యాంకర్ మల్లిక. ఆమె అదే రూటులో జయకేతనం ఎగరవేస్తూ.. తరువాత రాజకుమారుడు సినిమా ద్వారా సినిమాల్లో సైతం చిన్న చిన్న పాత్రలను చేయడం మొదలుపెట్టింది. హైదరాబాదుకు చెందిన ఈ యాంకర్.. ఈరోజు ఉదయం బెంగుళూరులో మరణించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ 39 ఏళ్ళ యాంకర్ గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నారట. ఆమె అసలు పేరు అభినవ. హైదరాబాద్ నారాయణగుడకు చెందిన మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన మల్లిక.. పెళ్ళి తరువాత నటనకూ యాంకరింగ్ కూ దూరమయ్యారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

మల్లిక భౌతికకాయాన్ని రేపు ఉదయం హైదరాబాద్ కు తరలించనున్నారట. అయితే ఈమెకు అసలు ఏమైంది.. ఎందుకు బెంగుళూరులో చికిత్స చేయించుకుంటున్నారు.. కోమాలోకి ఎందుకు వెళ్ళిపోయారు అనే విషయాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.