సర్కారు వారి పాట టీఆర్పీ.. 'బిచ్చగాడు' కంటే తక్కువ!

Fri Oct 07 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

TRP Ratings of Sarkaru Vaari Pata Film

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఆ సినిమా థియేటర్లలోకి రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా హడావిడిగా సినిమాను చూశారు. అయితే సినిమా విడుదలకు ముందు కనిపించిన హడావిడి ఆ తర్వాత మాత్రం పెద్దగా కనిపించలేదు. ఎన్నో ఆశలతో సినిమాకు వెళ్లిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను దర్శకుడు పూర్తిస్థాయిలో మాత్రం సంతృప్తి పరచలేకపోయాడు.మళ్ళీ ఎప్పటిలానే మహేష్ బాబు ఒకే తరహా సినిమాలో కనిపించాడు అని ఒకసారి చూడవచ్చు అనే విధంగా కూడా కామెంట్స్ వచ్చాయి. దర్శకుడు పరుశురాం గీతగోవిందం సినిమా తర్వాత మహేష్ బాబుతో చేస్తున్నాడు అనగానే మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా థియేటర్లలో అయితే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక టెలివిజన్లో కూడా చాలావరకు తక్కువ స్థాయిలోనే రేటింగ్స్ వచ్చాయి. గతంలో మహేష్ బాబు సినిమాలు టెలివిజన్ ప్రీమియర్స్ కు మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి.

కానీ ఈసారి ఒక డబ్బింగ్ సినిమాకు వచ్చినంత రేంజ్ లో కూడా రేటింగ్స్ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు స్టార్ మా లో మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 7. 45 రేటింగ్ మాత్రమే వచ్చింది.

ఒక విధంగా ఇది మహేష్ బాబు కెరీర్ లోనే అతి దారుణమైన రికార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండవసారి టెలికాస్ట్ అయినప్పుడు పుష్ప అల.. వైకుంఠపురములో అలాగే వకీల్ సాబ్ సినిమాలకు కూడా ఇంతకంటే ఎక్కువ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా బిచ్చగాడు సినిమాకు కూడా మొదటి ప్రీమియర్స్ కు 18.7 రేటింగ్ అయితే వచ్చింది.

కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు మొదటిసారి ఇంత తక్కువ స్థాయిలో రేటింగ్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కనీసం టీవీలలో అయినా సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.