మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...?

Wed Aug 05 2020 16:40:20 GMT+0530 (IST)

Prabhas gives green signal to another Pan India project ...?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ 'పాన్ ఇండియా స్టార్'గా మారిపోయారు. ఈ క్రమంలో తదుపరి సినిమా 'సాహో'తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలబెట్టుకున్నాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సైతం డార్లింగ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి' సినిమా కోసం ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి వర్క్ చేసిన ప్రభాస్.. 'సాహో' సినిమాతో టీ - సిరీస్ భూషణ్ కుమార్ తో కలిసాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ''రాధే శ్యామ్'' సినిమాకి కూడా టీ - సిరీస్ భూషణ్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీ - సిరీస్ వారు యంగ్ రెబల్ స్టార్ తో మూడో చిత్రంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు.కాగా ప్రభాస్ తో టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మైథోలాజికల్ డ్రామా స్టోరీ లైన్ ఇప్పటికే ప్రభాస్ కి చెప్పారని తెలుస్తోంది. అంతేకాకుండా స్టోరీ లైన్ కి ఇంప్రెస్ ఐన డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడని బాలీవుడ్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని కూడా పలు భారతీయ భాషల్లో రూపొందిస్తారట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ''రాధే శ్యామ్'' మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత టీ-సిరీస్ నిర్మాణంలో ఈ భారీ పౌరాణిక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ''రాధే శ్యామ్'' సినిమా ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పరిస్థితులు అనకూలిస్తే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటించనుంది. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ కాస్తా ఈ సినిమాతో 'గ్లోబల్ స్టార్' గా మారిపోతాడని చెప్పవచ్చు.