Begin typing your search above and press return to search.

సైరా.. వాల్మీకి డిజిట‌ల్ రైట్స్ సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   17 Sep 2019 5:30 PM GMT
సైరా.. వాల్మీకి డిజిట‌ల్ రైట్స్ సంగ‌తేంటి?
X
2019-20 మోస్ట్ అవైటెడ్ మూవీ RRR శాటిలైట్ - డిజిట‌ల్ రైట్స్ అన్ని భాష‌ల‌కు 160కోట్ల ఆఫ‌ర్ వ‌చ్చినా నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ సాగింది. నిర్మాత‌ దాన‌య్య‌ 250 కోట్ల మేర‌ డిమాండ్ చేస్తున్నార‌ని డీల్ ఇంకా పూర్తి కాలేద‌ని తెలిసింది. ర‌జ‌నీకాంత్- అక్ష‌య్ కుమార్- శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ 2.0కు అన్ని భాష‌ల‌ డిజిట‌ల్ - శాటిలైట్ రైట్స్ ని 170 కోట్ల‌కు అమ్మారు. ఆ త‌ర్వాత శాటిలైట్ లో బిగ్ రేంజ్ సినిమాలేవీ అంటే..

ప్ర‌భాస్ న‌టించిన సాహో డిజిట‌ల్ - శాటిలైట్ రైట్స్ అన్ని భాష‌ల‌కు క‌లుపుకుని 120 కోట్ల మేర సాగింది. తాజాగా మరో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `సైరా న‌ర‌సింహారెడ్డి` డిజిట‌ల్- శాటిలైట్ క‌లుపుకుని జీటీవీకి 125 కోట్ల‌కు అమ్మార‌ని తెలుస్తోంది. అన్ని భాష‌లు క‌లిపి సైరా ఇంత‌ ధ‌ర ప‌లికింద‌ట‌. `సైరా` చిత్రం భారీ మ‌ల్టీస్టార‌ర్. అన్ని భాష‌ల స్టార్లు న‌టించారు కాబ‌ట్టి ఇంత పెద్ద మొత్తం ప‌లికింద‌ని చెబుతున్నారు.

ఆ త‌ర్వాత క్రేజీ సినిమాలు ఓ మూడు ఉన్నాయి. బ‌న్ని `అల వైకుంటపురంలో` డిజిట‌ల్ రైట్స్ రేంజ్ 12-15కోట్ల మేర ప‌లుకింది. స‌న్ నెక్ట్స్ వాళ్లు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ చేజిక్కించుకున్నారు. జెమిని టీవీ ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకుందిట‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - అనీల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి 16.5 కోట్ల మేర శాటిలైట్ రైట్స్ కి జెమిని నెట్ వ‌ర్క్ కి విక్ర‌యించార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. అలాగే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన `వాల్మీకి` శాటిలైట్- డిజిట‌ల్ రైట్స్ క‌లుపుకుని 10 కోట్ల రేంజ్ ప‌లికింద‌ని తెలుస్తోంది. స్టార్ మాకి వాల్మీకి రైట్స్ ని క‌ట్ట‌బెట్టార‌ట‌.