తమిళ సైరాకు సూపర్ గుడ్ దన్ను

Tue Sep 17 2019 21:54:01 GMT+0530 (IST)

Sye Raa Tamilnadu Rights

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న రిలీజ్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భారతీయ భాషలలో రిలీజ్ చేస్తున్నారు.  తమిళ నాడు విషయానికి వస్తే ప్రముఖ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. నిర్మాణరంగంతో పాటు పంపిణీలో కూడా మంచి అనుభవం ఉన్న సంస్థ కావడంతో 'సైరా' ను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో నయనతార లాంటి స్టార్ హీరోయిన్.. విజయ్ సేతుపతి లాంటి సెన్సేషనల్ హీరో కీలక పాత్రలలో నటించడం తమిళ ప్రేక్షకులను ఆకర్షించే అంశంగా మారింది.  ఇదే కాకుండా చిరంజీవి కూడా తమిళ ప్రేక్షకులకు తెలిసిన హీరోనే కాబట్టి సూపర్ గుడ్ వారు భారీ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం.  బుధవారం నాడు 'సైరా' ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ వెర్షన్ కు చెన్నై లో ఒక స్పెషల్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారట.  సినిమాపై తమిళనాడులో భారీ క్రేజ్ లేకపోయినా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ హిస్టారికల్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 'సాహో' తర్వాతా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న టాలీవుడ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.