Begin typing your search above and press return to search.

అంకితా ఆంటీ... బికినీ ఫోటోకి మేకప్ ఏంటి..?

By:  Tupaki Desk   |   4 April 2020 3:30 AM GMT
అంకితా ఆంటీ... బికినీ ఫోటోకి మేకప్ ఏంటి..?
X
క‌రోనా వైర‌స్ కారణంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా దిగిన ఫొటోలతో పాటు బాగా పాపులర్ అయిన ఓల్డ్ బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మేము ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ట్రెండ్‌లో మేక‌ప్ వేసుకోకపోయినా అందంగా క‌నిపించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో లేటెస్ట్ యాప్స్, ఫీచర్స్ కలిగిన ఫోన్లు మార్కెట్లో కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి. ఇక ఏ ఫోటో పోస్ట్ చేయాల‌న్నా దాన్ని ఎడిటింగ్ చేయనిదే సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయట్లేదు చాలా మంది. సెలబ్రిటీలు దీనికేం మినహాయింపు కాదు. తాజాగా అంకితా కోన్వార్‌ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఈ వార్తలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

బాలీవుడ్ న‌టుడు మిలింద్ సోమ‌న్ భార్య అంకితా కోన్వార్‌ కొత్తగా ఏదైనా చేయాలనుకుని గ‌తేడాది బికినీలో తీసుకున్న పాత ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. అయితే లాస్ట్ ఇయర్ స‌మ్మ‌ర్‌కీ ఇప్ప‌టి స‌మ్మ‌ర్‌కు ప‌రిస్థితులు ఎంత‌గానో మారిపోయాయ‌ని చెబుతూ..‘గ‌తేడాది వేస‌విని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు దానికి కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది పరిస్థితి. ఎటువైపు వెళుతున్నామో..' అంటూ ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తూ బికినీతో ఉన్న పిక్ షేర్ చేసింది. దీనికి రిప్లై గా ఒక నెటిజన్ ‘స్కిన్‌టోన్ కాంతివంతంగా క‌నిపించడానికి ఫోటోను అంత‌లా ఎందుకు ఎడిట్ చేశారు.. మీ చామ‌న‌ ఛాయ రంగే మాకు న‌చ్చుతుంది' అని కామెంట్ చేసాడు. ‘ఇది కేవ‌లం ఇన్‌స్టాగ్రామ్ ఫిల్ట‌ర్ హనీ..!’ అంటూ స్వీట్ గా రిప్లై ఇచ్చింది అంకితా. లాక్ డౌన్ వేళ ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసున్న ఫోటోల‌ను సైతం పంచుకుంటూ అభిమానుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటోంది.