ఏజ్ బార్ లవ్ అయితే ఇలాగే ఉంటుంది మరి!

Sun Aug 14 2022 07:00:01 GMT+0530 (IST)

Sussanne Khan to Sushmita Sen

బాలీవుడ్ లో ట్రోలింగ్ కొత్తేం కాదు. సినిమాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడుతుంటారు. ఈ విషయంలో  ఎంతటి స్టార్ అయినా తప్పించుకునే ఛాన్స్ లేదు. తేడా జరిగితే  సీనియర్..జూనియర్ అనే తారతమ్యం లేకుండా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే. ఈ విషయంలో హీరోయిన్లు ఎక్కువగా టార్గెట్ అవుతుంటారు. సుస్సానే ఖాన్ నుంచి సుస్మితా సేన్ వరకూ ఎంతో మంది భామలు ఇంత వరకూ ట్రోలర్స్ బారిన పడ్డారు.  వీళ్లంతా వ్యక్తిగత విషయాల్లోనే వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది.సుస్సానే ఖాన్ -హృతిక్ రోషన్ విడిపోయిన తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు. సుస్సానే..హృతిక్ కొత్త జీవిత భాగస్వామిల్ని సైతం వెదుక్కున్నారు. సుస్సానే త్వరలోనే  ప్రియుడు గోనీతో ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతోంది.

హృతిక్  రోషన్ కి దూరమైన తర్వాత సుస్సానే ఇలా వేరొకరి దగ్గరవ్వడంపై హృతిక్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు. అలాగే హృతిక్ రోషన్ కూడా సబా అజాద్ ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసమే ఈ ట్రోలింగ్ కి  గురి చేసింది. తనకన్నా వయసులో భారీ వ్యత్యాసం ఉన్న యువతితో డేటింగ్ ఏంటి? అని మండిపడిన వైనముంది.

ఇక అర్జున్ కపూర్-మలైకా అరోరా అజరామర వ్యవహారమైతే ఎప్పటికప్పుడు నెట్టింట హాట్ టాపిక్. ప్రేమ కథ పాతదే అయినా మీడియాకి ఎక్కిన ప్రతీసారి ప్రెష్ కంటెంట్ అందించడం ఈ జంట ప్రత్యేకత.  ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసమే అన్ని రకాల విమ ర్శలకు దారి తీస్తుంది. ఇటీవలే పెళ్లి విషయంపై అర్జున్ కపూర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఆయన మాటల్ని బట్టి  మలైకా పై ప్రేమ తగిరినట్లు కనిపించింది. దీంతో అప్పుడే కథ కంచికి వచ్చిందా? అంటూ కపూర్ బోయ్ ని ఓ ఆట ఆడుకున్నారు.

ఇక సుస్మితాసేన్-లిలిత్ మోదీ వ్యవహారం గురించి చెప్పాల్సిన పనిలేదు. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ట్రోలింగ్ భారిన పడ్డారు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసమే మరోసారి నెటి జనుల్లో హాట్ టాపిక్ అయింది. అంతకు ముందు 10 మందికి బ్రేకప్ చెప్నిన సుస్మిత ఖాతాలో 11వ నెంబర్ లలిత్ అంటూ ట్రోల్ చేసారు. ఇదైనా పెళ్లి వరకూ వెళ్తుందా?  మధ్యలో వీగిపోతుందా? అంటూ సెటైర్లు పేలాయి. వీటికి సుస్మిత సైతం ధీటైన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది. తన ప్రపంచంలో మాటకు మాట..దెబ్బకు దెబ్బ అన్నదే సమాధానంగా భావించి ట్రోలర్స్ పై ప్రతి దాడికి దిగింది.