టాలీవుడ్ ప్రముఖ సింగర్ తండ్రి అనుమానస్పద మృతి..

Thu Nov 25 2021 12:29:47 GMT+0530 (IST)

Suspicious Death Of Tollywood Singer  Father

టాలీవుడ్ సింగర్ హరిణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వారం రోజులుగా సింగర్ హరిణి కుటుంబం కనిపించకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతున్న వేళ.. అందరూ షాక్ తినేలా హరిణి తండ్రి ఏకేరావు బెంగూళూరు సమీపంలోని ఓ రైల్వే మృత దేహం లభ్యమైంది. ఏకే రావు సుజన్ ఫౌండేషన్ లో సీఈవోగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు కనిపించకుండా పోయిన కుటుంబ సభ్యులు ఇప్పడు బెంగుళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో కనిపించారు. అయితే గత వారం రోజులుగా జాడలేకుండా పోయిన కుటుంబ సభ్యులు ఎక్కడకు వెళ్లారు. అసలు ఏకే రావుది ఆత్మహత్య హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టాలీవుడ్ సింగర్ ఆయల సోమయాజుల హరిణి ఇంట్లో ఓ మిస్టరీ కనిపిస్తోంది. శ్రీనగర్ కాలనీలో హరిణి కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. వారం రోజులుగా ఆ ఫ్యామిలీ మొత్తం మిస్సైపోయింది. ఈ మేరకు అంతా హల్‌చల్ అవుతున్న క్షణంలో ఇప్పటికిప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. ఆమె తండ్రి ఏకే రావు బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించారు. ఇప్పటి వరకూ జాడలేకుండా పోయిన ఫ్యామిలీ ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సింగర్ హరిణిరావు తండ్రి ఏకేరావు మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఏకేరావు సూసైడ్ నోట్ లభించడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఓ బడా వ్యక్తి మోసం చేశాడని కోరమంగళం పోలీస్టేషన్ కు లేఖ రాశారు ఏకేరావు. అయితే ఏకేరావు మృతదేహం దగ్గర కత్తి లభించడంతో ఆయనే చేయి మెడ కోసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టమ్ నివేదికలో కూడా అదే విషయం వెల్లడైంది. సుబదగుంట పోలీస్టేషన్ లో ఏకేరావుపై మూడు రోజుల క్రితం 420 కేసు నమోదైంది. తనకు జరిగిన మోసంపై నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులతో ఏకేరావు చర్చించినట్టు తెలుస్తోంది. అన్యాయంగా తనపై కేసు పెట్టారని వాపోయారు ఏకేరావు. ఈనెల 22న ఉదయం ఇంట్లో కత్తి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోరమంగళం పోలీస్టేషన్ కు అందిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.