Begin typing your search above and press return to search.

సమంత కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది..

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:39 AM GMT
సమంత కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది..
X
విడాకుల విషయంలో తన పరువు తీసేలా కథనాలు అల్లిన యూట్యూబ్ చానెళ్లపై సమంత దాఖలు చేసిన పరువు నష్టం కేసు విషయంలో కూకట్‌పల్లి కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. "పరువు నష్టం కేసు పెట్టే బదులు, యూట్యూబ్ ఛానెల్‌లు.. మీ పరువు తీసే వ్యక్తుల నుండి మీరు (సమంత) ఎందుకు క్షమాపణలు కోరకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టులో ఈరోజు సమంత అభిప్రాయాన్ని బట్టి తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే, కోర్టు ఈ కేసుపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.. ఈ కేసుపై సస్పెన్స్ కనీసం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది.

కోర్టు వ్యాఖ్యలు సమంత పరువునష్టం కేసును దాఖలు చేయకూడదని సూచిస్తున్నాయని అనిపిస్తోంది. దానిపై తుది తీర్పు కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంతలో సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లింది. ప్రస్తుతం ఆమె చార్ ధామ్ యాత్రలో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె రెండు చిత్రాలను లైన్లో పెట్టింది. నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.

ఇటీవల వైవాహిక బంధాన్ని కొనసాగించలేమంటూ సోషల్ మీడియా వేదికగా సమంత-నాగచైతన్య జోడి ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయడం సంచలనమైంది. ‘ఏంమాయ చేశావే’ సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు భార్యాభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ చానళ్లు, మీడియాలు ఇష్టానుసారంగా కథనాలు అల్లాయి. సమంతను టార్గెట్ చేసి ఆమె పరువుతీసేలా విష ప్రచారం చేశాయి. సమంత -నాగచైతన్య విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణం అంటూ కొన్ని యూట్యూబ్ చానెళ్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ ఈ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

అయితే నిజానికి ప్రీతమ్ సమంతను అక్క అని అని పిలుస్తాడు.. అయినా యూట్యూబ్ చానెళ్లు, నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండడంతో సమంత తాజాగా న్యాయపరమైన చర్యలకు దిగింది. తనపై సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు అల్లి పరువు తీసిన మూడు యూట్యూబ్ చానెళ్లపై కూకట్ పల్లి కోర్టులో సమంత పరువునష్టం దావా వేశారు. సమంత-నాగచైతన్య విడాకులపై ఈ యూట్యూబ్ చానెల్స్ దారుణంగా అసత్యాలు ప్రచారం చేశాయని సమంత పిటీషన్ లో పేర్కొన్నారు. కోర్టు న్యాయవాది బాలాజీ ఈ మేరకు కోర్టులో సమంత తరుఫున పరువు నష్టం పిటీషన్ వేసి వాదనలు వినిపించారు.తాజాగా కోర్టు విచారణ జరిపి క్షమాపణలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించింది.