పెద్ద ట్విస్ట్.. డిసెంబర్ సినిమాలు రావడం లేదా?

Wed Oct 16 2019 13:36:19 GMT+0530 (IST)

దసరా సీజన్ అయిపోయింది. ఇక ఈ ఏడాదిలో మిగిలి ఉన్న చెప్పుకోదగ్గ సీజన్ క్రిస్మస్ మాత్రమే.  పెద్ద స్టార్ల సినిమాలేవీ ఈ సీజన్లో రిలీజ్ కావడంలేదు కానీ మీడియం రేంజ్ స్టార్ల సినిమాలు ఈ సీజన్ పై కన్నేయడంతో తీవ్రపోటీ తప్పదనే అంచనాలు ఉన్నాయి.  దాదాపు ఓ అరడజను సినిమాలు డిసెంబర్ 20 నుండి 25 వరకూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.  అయితే వీటిలో మెజారిటీ సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందనేది విశ్వసనీయవర్గాల సమాచారం.ఇలా వాయిదా పడే సినిమాల లిస్టు పెద్దదిగానే ఉంది.  నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కిన 'భీష్మ' ను మొదట క్రిస్మస్ వీకెండ్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'భీష్మ'ను ఇప్పటికే వాయిదా వేశారు.  రవితేజ - వీఐ ఆనంద్ కాంబో 'డిస్కోరాజా' ను ఈ సీజన్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ వీఎఫ్ ఎక్స్ వర్క్ డిలే కారణంగా ఫైనల్ కాపీ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఈ సినిమా డిసెంబర్ సీజన్ ను మిస్ అవుతుందని అంటున్నారు.  సాయి ధరమ్ తేజ్ - మారుతి సినిమా 'ప్రతిరోజూ పండగే' కూడా ఫిబ్రవరికి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయట.

వెంకటేష్ -నాగ చైతన్య మల్టిస్టారర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఈమధ్య ఫీలర్స్ వచ్చాయి. ఇప్పటికే రణరంగంగా మారిన సంక్రాంతికి ఈ సినిమా వస్తే మరింత రచ్చగా మారుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాకు డిసెంబర్ రిలీజ్ డేట్ ను సెట్ చేసే ప్రయత్నాల్లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రయత్నాలు ప్రారంభించారట.  ఈ పరిణామాలు చూస్తుంటే మరో వారం పది రోజుల్లో ఏ సినిమాలు వస్తాయి.. ఏవి వాయిదా పడతాయి అనే విషయం ఫుల్ క్లారిటీ రావచ్చు.