పాతికేళ్ల మిస్ 44.. ఎన్నాళ్లీ బ్రహ్మచర్యం!

Tue May 21 2019 16:00:27 GMT+0530 (IST)

Sushmita Sen Completed 25 Years To Miss Universe Title

విశ్వసుందరి కిరీటం అందుకుని నేటితో పాతికేళ్లయ్యింది. ఇంకా ఈ మాజీ మిస్ బ్రహ్మచారిణిగానే మిగిలిపోయింది! ప్చ్!! ఇదీ అభిమానుల గోడు! బ్రహ్మచారిణి అయితేనేం..! కొందరు కిడ్స్ ని దత్తత తీసుకుని పెంచి పోషిస్తున్న గొప్ప మాతృమూర్తిగా పాపులారిటీ తెచ్చుకున్న సుశ్మితాసేన్.. అంతకుమించి గొప్ప మానవతావాదిగా సామాజిక సేవలో నిరంతరం బిజీగా ఉంటున్నారు. మరోవైపు కాస్త లేటు వయసులో ఘాటైన ప్రేమాయణం సాగించడంపైనా ఇటీవల పలు ఆసక్తికర కథనాలు వచ్చాయి. ముంబై టాప్ మోడల్ రోహమన్ తో పరిచయం.. అటుపై నాలుగు పదుల వయసులో ప్రేమలో పడిందంటూ సెటైర్లు వేశారు జనం. మొత్తానికి సుష్ లైఫ్ ఇలా సాగుతుండగానే.. నేటితో మిస్ యూనివర్శ్ గా కిరీటం గెలుచుకుని పాతికేళ్లయిపోయింది.నాటి మధుర జ్ఞాపకాన్ని ప్రియుడు రోహమన్ స్వయంగా ఓ ఫోటో రూపంలో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. సుష్ గతాన్ని గుర్తు చేస్తూ ఈ ఫోటోని షేర్ చేసినందుకు సుశ్మిత సేన్ అతడికి `ఐ లవ్ యు` అంటూ రిప్లయ్ ఇచ్చారు. మొత్తానికి సుశ్మిత సేన్ కి టుడే ఎంతో స్పెషల్ డే. బోయ్ ఫ్రెండ్ రోహమన్ ఇంకేదైనా స్పెషల్ న్యూస్ చెబుతాడేమో చూడాలి. ఇకపోతే గత ఏడాది కాలంగా రోహమన్ ని సుష్ పెళ్లాడేస్తుందని ప్రచారం సాగుతోంది. దానికి సంబంధించిన ప్రచారం తప్ప ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు.

సుశ్మితాసేన్(44) కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే.. 19 నవంబర్ 1975లో హైదరాబాద్ కి చెందిన ఓ బెంగాళీ బైద్య ఫ్యామిలీలో జన్మించారు. తండ్రి షుబీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. తల్లి శుభ్ర సేన్ జువెలరీ డిజైనర్. సొంతంగా దుబాయ్ లో ఓ జువెలరీ షోరూమ్ ని నిర్వహించేవారు. సుష్ కి నీలమ్- రాజీవ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. విశ్వసుందరిగా కిరీటం గెలుచుకున్న సుశ్మితాసేన్ అనంతర కాలంలో టాప్ మోడల్ గా.. బాలీవుడ్ కథానాయికగా కెరీర్ ని సాగించింది. టాలీవుడ్ లో నాగార్జున సరసన `రక్షకుడు` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయికగా వెలిగిపోకపోయినా తనకంటూ ఓ రేంజ్ ఉందని సుష్ నిరూపించింది. మోడలింగ్ పరిశ్రమకు ఎందరో అందాల రాణుల్ని తయారు చేసి అందించిన ట్రైనర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది.