Begin typing your search above and press return to search.

'సుశాంత్ ఫైనాన్సియల్ గా ఎప్పుడు ఇబ్బంది పడలేదు'

By:  Tupaki Desk   |   9 Aug 2020 2:30 AM GMT
సుశాంత్ ఫైనాన్సియల్ గా ఎప్పుడు ఇబ్బంది పడలేదు
X
సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. బీహార్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నివేదిక ప్రకారం రియాతో పాటు ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి - సంధ్య చక్రవర్తి మరియు సోదరుడు షోవిక్ చక్రవర్తిలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావిస్తున్న శామ్యూల్ మరియు శ్రుతి మోదీల పై కూడా సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తితో పాటు షోవిక్ చక్రవర్తికి కూడా ఒకప్పుడు శ్రుతి మోదీ మేనేజర్ గా వ్యవహరించిందని సమాచారం. అంతేకాకుండా సుశాంత్ బిజినెస్ మేనేజర్ గా కుండా ఉండేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కేసు కింద కేసు నమోదు చేసిన ఈడీ.. శ్రుతి మోదీకి సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో హాజరైన శ్రుతి నుండి సుశాంత్ మరియు రియాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

కాగా సుశాంత్ మరణించిన తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తులో భాగంగా శ్రుతి మోదీ కూడా విచారించారు. ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సుశాంత్ తో కలిసి 2019 జూలై నుండి 2020 ఫిబ్రవరి వరకు బిజినెస్ వ్యవహారాలు చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా సుశాంత్ మనీ పరంగా ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదని.. తన దగ్గర పని చేసే వారికి.. స్టాఫ్ కి జీతాలు కూడా సమయానికి చెల్లించేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సుశాంత్ కి నెల ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేవని.. సుమారు 10 లక్షల వరకు మెయింటనెన్స్ ఖర్చు అయ్యేదని.. బాంద్రా ప్లాట్ కి నెలకు రూ. 4.5 లక్షలు అద్దె చెల్లించేవాడని వెల్లడించింది. ఇక రియా చక్రవర్తిని కూడా ఈడీ అధికారులు విచారించారు.