Begin typing your search above and press return to search.

సుశాంత్.. స్నేహితుడి‌పై ద‌ర్యాప్తులో ఏం తేలింది?

By:  Tupaki Desk   |   18 Jun 2020 6:30 AM GMT
సుశాంత్.. స్నేహితుడి‌పై ద‌ర్యాప్తులో ఏం తేలింది?
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. ఈ కేసును ర‌క‌ర‌కాల కోణాల్లో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ పీఏ దిశా సాల్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణాలేమిటి? అన్న‌ది అంతుప‌ట్ట‌ని విష‌యం. ఆ క్ర‌మంలోనే దిశా సాల్ తాను పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న.. కాబోయే భ‌ర్త‌తో గొడ‌వ‌పడుతోంద‌ని దానివ‌ల్ల‌నే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని అయితే ఆ గొడ‌వ‌లో త‌ల‌దూర్చిన సుశాంత్ సింగ్ తీవ్రంగా హ‌ర్ట్ అయ్యాడ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. అలాగే అత‌డు ప్రేమించిన ఒక యువ‌తికి నిశ్చితార్థం జ‌రిగాక ఎంతో క‌ల‌త‌కు గుర‌య్యాడ‌ని వేరొక క‌థ‌నం వేడెక్కించింది.

అదంతా అలా ఉండ‌గానే త్వ‌ర‌లోనే సుశాంత్ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌స్తుత ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని.. సుశాంత్ స్నేహితుడు అయిన క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ ముఖేష్ చాబ్రాను పోలీసులు విచారించారు. ముఖేష్ చాబ్రాను ర‌క‌ర‌కాల కోణాల్లో డీసీపీ అభిషేక్ త్రిముఖే ప్ర‌శ్నించారు. ఈ విచార‌ణ‌లో ముఖేష్ చాలా సంగ‌తుల్ని వెల్ల‌డించారు.

సుశాంత్ మ‌ర‌ణ వార్త విన్న ముఖేష్ చాబ్రా తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాడు. ``నాకు సుశాంత్ సోదరుడితో స‌మానం. త‌న మరణం గుండె కోతను మిగిల్చింది. నాకు మాటలు రావడం లేదు`` అంటూ వాపోయిన అత‌డు.. ``సుశాంత్ మొహమాటస్తుడే.. కానీ తెలివైనవాడు.. ప్ర‌తిభావంతుడు`` అని తెలిపాడు. సుశాంత్ మ‌ర‌ణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాన‌ని త‌న‌కు ఎవ‌రూ ఫోన్ చేయొద్ద‌ని ముఖేష్ ఇన్ స్టాలో మీడియాని అభ్య‌ర్థించాడు. కొద్దిరోజుల పాటు తాను ఎవ‌రితోనూ మాట్లాడ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాన‌ని ఒత్తిడి పెంచ‌వ‌ద్ద‌ని కోరాడు.

ముఖేష్ బాలీవుడ్ లో ప్ర‌ముఖ కాస్టింగ్ డైరెక్ట‌ర్. సుశాంత్ కి చాలా కాలంగా స్నేహితుడు. ఆ స్నేహంతోనే అత‌డికి ద‌ర్శ‌కుడిగా మారే అవ‌కాశం ఇచ్చాడు సుశాంత్. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో `దిల్ బేచారా` సెట్స్ పై ఉంది. ఇదే సుశాంత్ సింగ్ చివ‌రి సినిమా అని తెలుస్తోంది. ఇక ఈ విచార‌ణ‌లో సుశాంత్ తో ముఖేష్ చాబ్రా స్నేహం గురించి త‌ప్ప ఇంకే వివ‌రాలు తెలిసిన‌ట్టు లేదు. డీసీపీ ఎలాంటి క్లూ ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం ఈ కేసును అనుమానాస్ప‌ద మృతిగా భావించ‌డం లేదు. ఆత్మ‌హ‌త్య‌గా కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.