ప్రముఖ కామెడీ నటికి ఎన్సీబీ షాక్

Sat Nov 21 2020 21:00:22 GMT+0530 (IST)

Sushant Singh Rajput death case

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని డ్రగ్స్ దందా మొత్తం వెలుగుచూసింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పలువురిని పోలీసులు విచారించారు.తాజాగా బాలీవుడ్ కామెడీ క్వీన్ నటి భారతీ సింగ్ కు షాక్ తగిలింది. తాజాగా ముంబైలో ఉన్న ఆమె నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్ తోపాటు ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఆమె ఇంట్లో కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. భారతి ఆమె హర్ష్ కు ఎన్సీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు.

ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై కూడా ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్ అతడి స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించారు.  డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆ మందులు వాడుతున్నామని.. డ్రగ్స్ తో సంబంధం లేదని అర్జున్ పేర్కొన్నాడు. తాజాగా మరో ప్రముఖ నటి పట్టుబడడం కలకలం రేపింది.