Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో మరో ట్విస్ట్

By:  Tupaki Desk   |   19 Oct 2020 8:30 AM GMT
సుశాంత్ కేసులో మరో ట్విస్ట్
X
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో మిస్టరీ వీడడం లేదు. ఈ కేసులో మరో కీలక పరిణామం తాజాగా చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగుచూడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) ఆ దిశగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్ల సోదరుడిని అరెస్ట్ చేయడం సంచలనమైంది.

సుశాంత్ కేసులో గాబ్రియెల్ల సోదరుడికి సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్.సీ.బీ అతడిని రిమాండ్ లోకి తీసుకుంది. ఇతడు దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్ ను డ్రగ్ పెడ్లర్లతో కలిసి సన్నిహితంగా మెలిగాడే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసిన ఎన్.సీబీ. అధికారులు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు.

ఇప్పటికే సుశాంత్ కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ ను, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియా 28 రోజులు జైలు జీవితం అనుభవించి తాజాగా బెయిల్ పై విడుదలైంది.

ఇదే కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ లాంటి వారిని ఎన్.సీబీ విచారించింది. తాజాగా గాబ్రియెల్ల సోదరుడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.