Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసు : శ్రద్ధా - సారా స్టేట్మెంట్స్ తో మరో మలుపు తిరిగిందా...?

By:  Tupaki Desk   |   28 Sep 2020 7:30 AM GMT
సుశాంత్ కేసు : శ్రద్ధా - సారా స్టేట్మెంట్స్ తో మరో మలుపు తిరిగిందా...?
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డెత్ మిస్టరీని చేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరియు ఈడీ రంగంలోకి దిగాయి. అయితే ఈ కేసును విచారించే క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో అప్పటి వరకు విచారణ చేస్తున్న సీబీఐ మరియు ఈడీలతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా సుశాంత్ తో కలిసి నటించిన సారా అలీఖాన్ - శ్రద్ధాకపూర్ లకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఈ నేపథ్యంలో సారా - శ్రద్ధా లు సుశాంత్ గురించి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

కాగా, ఎన్సీబీ విచారణలో సారా - శ్రద్ధా ఇద్దరూ తాము సుశాంత్ ఫార్మ్ హౌస్ లో నిర్వహించే పార్టీలకు అటెండ్ అయినట్లు అంగీకరించినప్పటికీ.. తాము డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సుశాంత్ డ్రగ్స్ తీసుకోవడం చూశామని.. షూటింగ్ బ్రేక్ టైంలో సుశాంత్ వ్యానిటీ వ్యాన్ లో డ్రగ్స్ తీసుకునేవాడని ఇద్దరు హీరోయిన్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంతకముందు రియా చక్రవర్తి కూడా సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటాడని అఫిడవిట్ లో పేర్కొన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు సహ నటీమణుల స్టేట్మెంట్స్ తో సుశాంత్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటాడనే విషయంలో వెలుగులోకి వచ్చినట్లైంది. ఇన్నాళ్లు డెత్ మిస్టరీగా కొనసాగిన కేసు కాస్తా అనేక పరిణామాల తర్వాత సుశాంత్ ని డ్రగ్ అడిక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తోందని ఆయన సపోర్టర్స్ ఆవేదన చెందుతున్నారు. సారా - శ్రద్ధాల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన పోలీసులు.. వారు చెప్పిన విషయాన్ని సుశాంత్ తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ ఈ కేసులో నిజానిజాలు త్వరగా బయటకు తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.