Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసు.. అమిత్ షా మాస్టర్ ప్లాన్

By:  Tupaki Desk   |   11 Aug 2020 8:50 AM GMT
సుశాంత్ కేసు.. అమిత్ షా మాస్టర్ ప్లాన్
X
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి రెండు నెలలు దాటిపోయింది. ఈ కేసును విచారించిన ముంబయి పోలీసులు.. ఆరంభం దశలోనే సుశాంత్‌ది ఆత్మహత్యగా తేల్చేశారు. పూర్తి విచారణ తర్వాత కూడా ఇదే మాటకు కట్టుబడ్డారు. కానీ సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతడి అభిమానులు మాత్రం తనది సాధారణ ఆత్మహత్య కాదని బలంగా వాదిస్తున్నారు. అతడిని ఎవరో హత్య చేసి ఉండొచ్చని లేదా.. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించి ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్‌లో ప్రభుత్వం సీబీఐ విచారణ విషయంలో పట్టుబట్టింది. సుశాంత్ కుటుంబ సభ్యుల డిమాండ్ కూడా ఇదే కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించింది.

ఐతే మహారాష్ట్ర సర్కారు మాత్రం ముంబయి పోలీసులకు బాసటగా నిలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న బాలీవుడ్ బడా బాబులకు కూడా ఇక్కడి సర్కారు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. సుశాంత్ కేసును విచారించేందుకు బీహార్ పోలీసులు వస్తే వాళ్లకు ముంబయిలో ఎలాంటి సహకారం అందలేదు. అడుగడుగునా ఇక్కడి పోలీసులు వారికి అడ్డు పడ్డారు. ఐపీఎస్ అధికారి వినయ్ అధికారి బీహార్ ప్రభుత్వం తరఫున ముంబయికి విచారణ కోసం రాగా.. ఆయన్ని క్వారంటైన్ నిబంధనల పేరుతో హౌస్ అరెస్ట్ చేశారు ముంబయి పోలీసులు. ఐతే ఈ సమయంలో కేంద్ర హోం మంత్రి మాస్టర్ ప్లాన్ వేశారు. ‘సింగం’ సినిమా సన్నివేశాన్ని తలపిస్తూ ఆయన్నే సీబీఐ అధికారిగా నియమించారు. ఆయనిప్పుడు సీబీఐ అధికారి హోదాలో సుశాంత్ కేసును విచారించబోతున్నారు. ‘సింగం’లో ఐపీఎస్ అధికారి అయిన సూర్య ఓ నిందితుడిని అరెస్టు చేయడం కోసం అప్పటికప్పుడు కర్ణాటక పోలీస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుంటాడు. ఇప్పుడిక్కడ సీన్ రివర్సయింది. మరి ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. సీబీఐ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.