Begin typing your search above and press return to search.

ఆఫ‌ర్లు రావు.. ఖ‌ర్చుల‌కైనా క‌ష్ట‌మేన‌ని క‌ల‌త‌కు గురై!

By:  Tupaki Desk   |   5 Aug 2020 6:30 AM GMT
ఆఫ‌ర్లు రావు.. ఖ‌ర్చుల‌కైనా క‌ష్ట‌మేన‌ని క‌ల‌త‌కు గురై!
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఇప్ప‌టికే 50 మంది నుంచి వాంగ్మూలం సేక‌రించామ‌ని ముంబై పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో తాజాగా బిహారీ పోలీసుల ద‌ర్యాప్తు హీట్ పెంచేస్తోంది. ఎవ‌రి వెర్ష‌న్ నిజం? అన్న‌ది తేల‌డం లేదు. ముంబై పోలీసులు చెబుతున్న క‌థ‌ల‌కు బిహారీ పోలీసుల క‌థ‌నాల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌డం లేదు.

ఇలాంటి సందిగ్ధావ‌స్త‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్ ‌మేట్ సిద్ధార్థ్ పిథాని చెప్పిన ఓ విష‌యం ఈ కేసులో ర‌క‌ర‌కాల సందేహాల్ని లేవనెత్తింది. ``తనకు ఎలాంటి సినిమాలు రావు అని.. సుశాంత్ తన ఖర్చుల గురించి ఆందోళన చెందాడు`` అని పితాని అన‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న తన బాంద్రా నివాసంలో కన్నుమూశారు. అప్ప‌టికికే సుశాంత్ తీవ్ర క‌ల‌త‌లో ఉన్నాడ‌ని.. భవిష్యత్తులో చిత్ర పరిశ్రమలో తనకు మ‌రో అవ‌కాశం రాదని భావించాడని స్నేహితుడు సిద్ధార్థ్ పితాని వెల్లడించారు.

సుశాంత్ తనను పిలిచి ఉద్యోగం ఇచ్చాడని.. అప్ప‌టికే చేస్తున్న‌ ఉద్యోగాన్ని వదిలుకుని సుశాంత్ వ‌ద్ద ఉద్యోగానికి చేరాడ‌ట‌. అయితే సుశాంత్ సింగ్ తనకు సినిమాలు రాకపోవడంతో డబ్బు చెల్లించలేనని చెప్పాడు. అయితే అతని ఫ్లాట్ మేట్ దాని వెనుక గల కారణమేమిటి? అని ప్ర‌శ్నిస్తే .. సుశాంత్ దానికి సమాధానం చెప్పలేకపోయాడట‌.

ఖర్చుల గురించి సుశాంత్ ఆందోళన చెందాడ‌ని.. రియా చక్రవర్తి అత‌డి క్రెడిట్ కార్డుల్ని వస్తువుల కొనుగోలు కోసం ఉపయోగిస్తున్నట్లు సుశాంత్ సిబ్బంది త‌న‌కు చెప్పార‌ని సిద్ధార్థ్ ఈ ఇంట‌ర్వ్యూలో తెలిపారు‌. ఖ‌ర్చుల‌పై ఆందోళ‌న చెందొద్ద‌ని రియా అన్నిటినీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటుంద‌ని సుశాంత్ త‌న‌తో అన్నాడ‌ని పితాని వెల్ల‌డించారు. ఇంత‌లోనే ఘోరం జ‌రిగిపోయింద‌ని ఆవేద‌న చెందాడు. 2020 జనవరికి ముందు నేను ఇంటర్న్ మాత్రమే. జనవరి తర్వాత సుశాంత్ నాకు ఉద్యోగం ఇచ్చాడు అని సిద్ధార్థ్ పిథాని తెలిపారు. బాలీవుడ్ మాఫియా పెద్ద‌లంతా ఉచ్చు వేసి సుశాంత్ సింగ్ కి అవ‌కాశాలు రాకుండా కుట్ర చేశారా? అన్న సందేహం అత‌డు చెబుతున్న దానిని బ‌ట్టి మ‌రోసారి రైజ్ అయ్యింది. ఇక ఈ కేసులో సుశాంత్ సింగ్ మేనేజ‌ర్ దిశా సాలిన్ ఆత్మ‌హ‌త్యతో ఉన్న లింకు ఏమిటి? రియా చ‌క్ర‌వ‌ర్తి తో మ‌నీ ట్రాన్జాక్ష‌న్స్ .. బ్యాంకు ఖాతాల నుంచి న‌గ‌దు మాయం వ‌గైరా వ‌గైరా ఎన్నో సందేహాల‌కు స‌రైన ఆన్స‌ర్లు క‌నిపించ‌డం లేదు. దర్యాప్తులోనూ ముంబై పోలీసుల వెర్ష‌న్ ని సుశాంత్ స్వ‌స్థ‌లం నుంచి వ‌చ్చిన‌ బిహారీ పోలీసులు త‌ప్పు ప‌డుతున్నారు.